చ‌రిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా | Vaibhav Suryavanshi Creates History, Breaks Suresh Rainas Record | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా

Jul 3 2025 9:39 AM | Updated on Jul 3 2025 11:41 AM

Vaibhav Suryavanshi Creates History, Breaks Suresh Rainas Record

ఇంగ్లండ్ గడ్డపై భారత అండర్‌-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుధవారం నార్తాంప్టన్ వేదికగా ఇంగ్లండ్ అండర్‌-19 జట్టుతో జరిగిన మూడో యూత్ వన్డేలో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 269 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో తన తుపాన్ ఇన్నింగ్స్‌లో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

వైభవ్‌ సాధించిన రికార్డులు ఇవే..
👉అండర్‌-19 వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 80 ప్లస్ రన్స్‌ చేసిన ఆటగాడిగా సూర్యవంశీ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా 2004లో స్కాట్లాండ్ అండర్‌-19 జట్టుపై 236.84 స్ట్రైక్‌రేట్‌తో 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో 31 బంతుల్లో 277.41 స్ట్రైక్‌రేట్‌తో 86 ప‌రుగులు చేసిన వైభ‌వ్‌..  రైనా ఆల్‌టైమ్ రికార్డు రికార్డు బ్రేక్‌ను చేశాడు.

👉అండర్ 19 వన్డేలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. వైభశ్ సూర్యవంశీ కంటే ముందు రిషభ్ పంత్.. అండర్ 19 వన్డేల్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

👉అండ‌ర్‌-19 యూత్ వ‌న్డేలో భార‌త త‌రపున అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా వైభ‌వ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మన్‌దీప్ సింగ్(8 సిక్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో 9 సిక్సర్లు బాది మన్‌దీప్ రికార్డును వైభవ్ అధగమించాడు.
చదవండి: #Shubman Gill: చ‌రిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్‌.. తొలి భారత ప్లేయర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement