చ‌రిత్ర సృష్టించిన తిల‌క్ వ‌ర్మ‌.. | Tilak Varma Only Player-Reach-5K-Runs-Above-40 Plus-Avg-140 Plus Strike Rate | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన తిల‌క్ వ‌ర్మ‌..

Oct 9 2026 10:11 PM | Updated on Oct 9 2026 10:20 PM

Tilak Varma Only Player-Reach-5K-Runs-Above-40 Plus-Avg-140 Plus Strike Rate

Photo Credit: Twitter

రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్‌లో ఫినిషర్‌గా వచ్చిన తిలక్ వర్మ మరోసారి తన విలువను చాటి చెప్పాడు. కెప్టెన్‌తో కలిసి వైస్ కెప్టెన్ చేసిన విధ్వంసంతో భారత్ స్కోరు 240 పరుగులు దాటేసింది. 18 బంతుల్లోనే 44 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 

మరో విశేషమేమిటంటే షమర్ స్ప్రింగర్ బౌలింగ్‌లో తిలక్ వర్మ హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. ఈ నేపథ్యంలోనే తిలక్ వర్మ పురుషుల టీ20 క్రికెట్‌లో 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 166 ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ ఈ ఫీట్ అందుకున్నాడు. కాగా టీ20 క్రికెట్‌లో భారత బ్యాటర్లలో అత్యంత వేగంగా 5వేల పరుగుల మార్క్‌ను అందుకున్న బ్యాటర్ల జాబితాలో తిలక్ వర్మ ఐదో స్థానంలో నిలిచాడు. 

కేఎల్ రాహుల్ (143 ఇన్నింగ్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (145 ఇన్నింగ్స్‌లు), శుబ్‌మన్ గిల్ (154 ఇన్నింగ్స్‌లు), అభిషేక్ శర్మ (165 ఇన్నింగ్స్‌లు) తిలక్ కంటే ముందున్నారు. అయితే కోహ్లికి టీ20 క్రికెట్‌లో 5వేల పరుగుల మార్క్‌ను చేరేందుకు 167 ఇన్నింగ్స్‌లు అవసరమవ్వగా.. తిలక్‌ వర్మ ఒక్క ఇన్నింగ్స్‌ తక్కువ తేడాతో అతడి రికార్డును బద్దలుకొట్టాడు. 

ఒకే ఒక్కడు..
ఈ క్రమంలో తిలక్ వర్మ ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటంటే.. ఇప్పటి వరకు 143 మంది ఆటగాళ్లు 5000కు పైగా పరుగులు సాధించారు. వారిలో 44 మంది 140 లేదా అంతకంటే ఎక్కువ స్ట్రైక్-రేట్‌ను కొనసాగిస్తూ ఆ మార్క్‌ను అందుకున్నారు. 

ఇక‌ ఆ 143 మంది ఆటగాళ్లలో ఐదుగురు 40 లేదా అంతకంటే ఎక్కువ సగటును కలిగి ఉన్నారు. అయితే 40 కంటే ఎక్కువ సగటుతో, 140 కంటే ఎక్కువ స్ట్రైక్-రేట్‌తో 5వేల‌ కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా తిలక్ వర్మ (41.57 సగటుతో 5031 పరుగులు, స్ట్రైక్ రేట్: 145.36) చ‌రిత్ర‌ సృష్టించాడు.

డెత్ ఓవ‌ర్లంటే చెల‌రేగిపోతాడు
ఇక టీ20ల్లో డెత్ ఓవ‌ర్లు అంటేనే తిల‌క్ వ‌ర్మ‌కు పూన‌కాలు వ‌స్తాయి. 2026 ఏడాదిలో డెత్ ఓవ‌ర్స్‌లో 178 బంతులాడిన తిల‌క్ 232.58 స్ట్రైక్‌రేట్‌తో 414 ప‌రుగులు చేయ‌డం విశేషం. ఈ ఏడాది డెత్ ఓవ‌ర్ల‌లో కనీసం 100 బంతులు ఎదుర్కొన్న 58 మంది బ్యాటర్లలో తిల‌క్ వ‌ర్మ‌దే అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కావ‌డం విశేషం.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement