అదరగొట్టిన తనీష్‌.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్‌ | Tanush Kotian Impresses With Fighting Fifty For India A | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన తనీష్‌.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్‌

Jun 9 2025 9:14 PM | Updated on Jun 9 2025 9:18 PM

Tanush Kotian Impresses With Fighting Fifty For India A

ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ జట్టు అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. టీమిండియా త‌మ సెకెండ్ ఇన్నింగ్స్‌ను 417/7 వద్ద డిక్లేర్‌ చేసింది. 163/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్‌-ఎ.. అదనంగా 254 పరుగులు జోడించింది.

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపునుకుని ఇంగ్లండ్ లయన్స్ ముందు 439 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు ఉంచింది. భారత బ్యాటర్లలో తనీష్ కోటియన్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. తనీష్(108 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 90) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిమన్యు ఈశ్వరన్‌(80), రాహుల్‌(51), కాంబోజ్‌(51) రాణించారు.

ఇంగ్లండ్‌ లయన్స్‌ బౌలర్లలో జార్జ్‌ హిల్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్‌ వోక్స్‌, జాక్‌ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇదే ఆఖరి రోజు కావడంతో మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement