T20 World Cup 2024: రెచ్చిపోయిన డికాక్‌.. యూఎస్‌ఏ ముందు భారీ లక్ష్యం | T20 World Cup 2024: South Africa Set 195 Runs Target For USA, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: రెచ్చిపోయిన డికాక్‌.. యూఎస్‌ఏ ముందు భారీ లక్ష్యం

Jun 19 2024 9:43 PM | Updated on Jun 20 2024 11:14 AM

T20 World Cup 2024: South Africa Set 195 Runs Target For USA

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో యూఎస్‌ఏతో ఇవాళ (జూన్‌ 19) జరుగుతున్న తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి యూఎస్‌ఏ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్వింటన్‌ డికాక్‌ (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), ఎయిడెన్‌ మార్క్రమ్‌ (32 బంతుల్లో 46; 4 ఫోర్లు, సిక్సర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (22 బంతుల్లో 36 నాటౌట్‌; 3 సిక్సర్లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (16 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు) సత్తా చాటగా.. అమెరికా బౌలర్లలో సౌరబ్‌ నేత్రావల్కర్‌ (4-0-21-2), హర్మీత్‌ సింగ్‌ (4-0-24-2) వికెట్లు తీశారు.  

తుది జట్లు..

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

యునైటెడ్ స్టేట్స్: షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(వికెట్‌కీపర్‌), ఆరోన్ జోన్స్(కెప్టెన్‌), నితీష్ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోష్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్

 

Advertisement
 
Advertisement
Advertisement