T20 WC: ద‌క్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్ పోరు.. తుది జ‌ట్లు ఇవే | Sakshi
Sakshi News home page

T20 WC: ద‌క్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్ పోరు.. తుది జ‌ట్లు ఇవే

Published Mon, Jun 10 2024 7:53 PM

T20 WC 2024: South Africa opt to bat against Bangladesh

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో ఆస‌క్తిర స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూయ‌ర్క్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ద‌క్షిణాఫ్రికా ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగ‌గా.. బంగ్లాదేశ్ మాత్రం త‌మ జ‌ట్టులో ఒక మార్పు చేసింది. 

ఆల్‌రౌండ‌ర్ సౌమ్యా స‌ర్కార్ స్ధానంలో వికెట్ కీప‌ర్ జ‌కీర్ అలీ వ‌చ్చాడు. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ జ‌ట్టు విజ‌యం సాధిస్తే  నేరుగా సూప‌ర్‌-8 అర్హ‌త సాధిస్తోంది. గ్రూపు-డిలో పాయింట్ల ప‌ట్టిక‌లో ద‌క్షిణాఫ్రికా(4) అగ్ర‌స్ధానంలో ఉండ‌గా.. బంగ్లాదేశ్(2) పాయింట్ల‌తో రెండో స్ధానంలో ఉంది.

తుది జ‌ట్లు
బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(వికెట్ కీప‌ర్‌), నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్‌), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, జాకర్ అలీ, మహ్మదుల్లా, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్.

Advertisement
 
Advertisement
 
Advertisement