రెడ్ కార్డు టర్నింగ్ పాయింట్‌.. బోస్నియాపై స్విస్ దూకుడు | Switzerland beat 10 man Bosnia behind Manzambi double in World Cup 2026 game | Sakshi
Sakshi News home page

రెడ్ కార్డు టర్నింగ్ పాయింట్‌.. బోస్నియాపై స్విస్ దూకుడు

Jun 19 2026 3:52 AM | Updated on Jun 19 2026 3:52 AM

Switzerland beat 10 man Bosnia behind Manzambi double in World Cup 2026 game

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో స్విట్జర్లాండ్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. బోస్నియా అండ్‌ హెర్జేగోవినాపై 4-1 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది.

73వ నిమిషం వరకు ఇరు జట్ల తరఫున ఒక్క గోల్‌ కూడా నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే యువ మిడ్‌ఫీల్డర్ జోహాన్‌ మంజాంబి అద్భుత వాలీతో తొలి గోల్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.

ఆ వెంటనే బోస్నియా డిఫెండర్ తారిక్‌ ముహరెమోవిక్‌ ప్రత్యర్ది గోల్ అవకాశాన్ని అడ్డుకోవడంతో రెడ్ కార్డుకు గురై మైదానం వీడాడు. దీంతో 10 మంది ఆటగాళ్లతో బోస్నియా తీవ్ర ఒత్తిడికి లోనైంది.

ఈ దశలో (84వ నిమిషం) స్విట్జర్లాండ్ తరఫున రూబెన్‌ వర్గాస్‌ రెండో గోల్ చేయగా, మంజాంబీ మరోసారి (90వ నిమిషం) బంతిని నెట్‌లోకి పంపి డబుల్ పూర్తి చేశాడు.

ఇంజరీ టైమ్‌లో (90+3) ఎర్మిన్‌ మహ్మిక్‌ బోస్నియాకు కంటితుడుపు గోల్ అందించినా, చివర్లో (90+7) గ్రానిట్‌ హాకా పెనాల్టీని గోల్‌గా మలిచి 4-1 గోల్స్‌తో స్విస్‌ విజయాన్ని ఖాయం చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement