breaking news
Bosnia and Herzegovina
-
'భళా' బెల్జియం
సీటెల్: బెల్జియం, సెనెగల్ మధ్య రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్... ఎలా చూసినా ప్రత్యర్థికంటే బెల్జియం బలమైన జట్టు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో ఉండటంతో పాటు ‘ఫిపా’ ప్రపంచ కప్‌లో ఎంతో మెరుగైన రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌లోనూ బెల్జియంనే అంతా ఫేవరెట్‌గా భావించారు. కానీ సెనెగల్ అసాధారణ ప్రదర్శనతో పెను సంచలనం నమోదయ్యేలా కనిపించింది. మ్యాచ్‌లో మరో 5 నిమిషాలు మిగిలి ఉండగా సెనెగల్ 2–0తో ముందంజలో ఉంది.ఈ ఆఫ్రికా జట్టు ప్రిక్వార్టర్స్ చేరడం ఖాయమనిపించింది. అయితే బెల్జియం తమ స్థాయికి తగ్గ ఆటతో ఒక్కసారిగా కోలుకుంది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేయడంతో పాటు మ్యాచ్‌ను అదనపు సమయానికి మళ్లించగలిగింది. ఈ దశలో అనూహ్యంగా లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచి ఊపిరి పీల్చుకుంది. చివరకు 3–2తో సెనెగల్‌ను ఓడించి తర్వాతి రౌండ్లోకి అడుగు పెట్టింది. ముందుగా సెనెగల్ తరఫున హబీబ్ దియారా (24వ నిమిషంలో), ఇస్మాయిలా సార్ (51వ ని.) గోల్స్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపారు. ఆ తర్వాత బెల్జియం తరఫున ఆ జట్టు టాప్ ప్లేయర్ రొమెలు ల్యూకాకు (86వ నిమిషం), యూరీ టైల్మన్స్ (89వ ని.) గోల్స్ కొట్టడంతో స్కోరు సమమైంది. అదనపు సమయంలో సెనెగల్ ఆటగాడు లామిన్ కమారా ఫౌల్ చేయడంతో బెల్జియంకు పెనాల్టీ దక్కింది. దీనిపై సెనెగల్ ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేసినా వీడియో రివ్యూ (వీఏఆర్) ద్వారా రిఫరీ పెనాల్టీని సరైందిగా తేల్చాడు. ఈ అవకాశాన్ని బెల్జియం వదులుకోలేదు. 120+5వ నిమిషంలో బంతిని యూరీ టైల్మన్స్ నెట్లోకి పంపించడంతో బెల్జియం సంబరాల్లో మునిగిపోయింది. 2 గోల్స్ కొట్టిన కెప్టెన్ టైల్మన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. 2018 వరల్డ్ కప్‌లో కూడా బెల్జియం ఇదే తరహాలో జపాన్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో 0–2తో వెనుకబడి కూడా ఆపై 3–2తో విజయాన్ని అందుకుంది. 10 మందితో గెలిచిన యూఎస్...శాన్ఫ్రాన్సిస్కో: ఆతిథ్య జట్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) ప్రపంచ కప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. టోర్నీ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండేసి గోల్స్ కొట్టిన జట్టు నాకౌట్ పోరులోనూ అదే జోరును కొనసాగించింది. బోస్నియా అండ్ హెర్జిగోవినాతో జరిగిన పోరులో అమెరికా 2–0తో విజయం సాధించింది. యూఎస్ తరఫున ఫొలారిన్ బాలోగన్ (45వ నిమిషం), మలిక్ టిల్మాన్ (82వ ని.) ఒక్కో గోల్ నమోదు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి బాలోగన్ దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దూసుకుపోయాడు. 31వ నిమిషంలో అతను మొదటి గోల్ కొట్టినా రిఫరీ దానిని ‘ఆఫ్‌సైడ్’గా గుర్తించి తిరస్కరించాడు. కొద్ది సేపటి తర్వాత బంతిని నిలువరించే ప్రయత్నంలో ప్రత్యర్థి ఆటగాడు ముహరెమొవిచ్ నియంత్రణ కోల్పోగా... దీనిని అవకాశంగా మలచుకున్న బాలోగన్ పదునైన కిక్‌తో తొలి గోల్‌గా మలిచాడు. అయితే బాలోగన్‌ను దురదృష్టం వెంటాడింది. ఆటలో దూసుకుపోతున్న తరుణంలో బంతిని తప్పిస్తుండగా అనూహ్యంగా అతని కాలు ముహరెమొవిచ్కు బలంగా తాకింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా రిఫరీ భావించాడు. వీడియో రివ్యూలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో బాలోగన్‌కు రిఫరీ 64వ నిమిషంలోనే ‘రెడ్ కార్డ్’ చూపించాడు.ఫలితంగా ఒక మ్యాచ్ నిషేధం కారణంగా బెల్జియంతో జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు. బాలోగన్‌ను తప్పించడంతో మిగిలిన 26 నిమిషాలు యూఎస్ పది మంది ఆటగాళ్లతోనే పోరాడింది. ఈ సమయంలో ఒక గోల్ నమోదు చేయడంతో పాటు పటిష్టమైన డిఫెన్స్‌తో బోస్నియాను నిలువరించడంలో సఫలమైంది. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ చేసిన తర్వాత రెడ్‌కార్డుకు గురైన మూడో ఆటగాడిగా బాలోగన్ నిలిచాడు. 2002లో రొనాల్డిన్హో (బ్రెజిల్), 2006లో జినెదిన్ జిదాన్ (ఫ్రాన్స్) ఈ తరహాలో శిక్షకు గురయ్యారు. -
రెడ్ కార్డు టర్నింగ్ పాయింట్.. బోస్నియాపై స్విస్ దూకుడు
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్విట్జర్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బోస్నియా అండ్ హెర్జేగోవినాపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.73వ నిమిషం వరకు ఇరు జట్ల తరఫున ఒక్క గోల్ కూడా నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే యువ మిడ్‌ఫీల్డర్ జోహాన్ మంజాంబి అద్భుత వాలీతో తొలి గోల్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.ఆ వెంటనే బోస్నియా డిఫెండర్ తారిక్ ముహరెమోవిక్ ప్రత్యర్ది గోల్ అవకాశాన్ని అడ్డుకోవడంతో రెడ్ కార్డుకు గురై మైదానం వీడాడు. దీంతో 10 మంది ఆటగాళ్లతో బోస్నియా తీవ్ర ఒత్తిడికి లోనైంది.ఈ దశలో (84వ నిమిషం) స్విట్జర్లాండ్ తరఫున రూబెన్ వర్గాస్ రెండో గోల్ చేయగా, మంజాంబీ మరోసారి (90వ నిమిషం) బంతిని నెట్లోకి పంపి డబుల్ పూర్తి చేశాడు.ఇంజరీ టైమ్‌లో (90+3) ఎర్మిన్ మహ్మిక్ బోస్నియాకు కంటితుడుపు గోల్ అందించినా, చివర్లో (90+7) గ్రానిట్ హాకా పెనాల్టీని గోల్‌గా మలిచి 4-1 గోల్స్‌తో స్విస్ విజయాన్ని ఖాయం చేశాడు. -
భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి.. 13 మంది మృతి
యూరోపియన్ దేశమైన బోస్నియా-హెర్జెగోవినాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణగంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు, కొండచరియలు విరిగినపడిన ఘటనలో 13 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి బోస్నియాకు రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.BREAKING!!! WORLD MEDIA DONT TALK ABOUT THIS !!! Bosnia and Herzegovina under heavy flooding may lives lost, many disappeared. pic.twitter.com/DniAUgk87n— Neo (@petrovicsrb) October 5, 2024 ఈ ఘటనలో శిథిలాలల కింది చిక్కుకున్న ప్రజలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కోనసాగిస్తున్నాయి. కనీసం 10 మంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదని, మృతిచెందిన వారిలో చాలా మంది దక్షిణ బోస్నియాలోని డోంజా జబ్లానికా గ్రామంలో ఉన్నారని అధికారులు తెలిపారు.BREAKING!!! Jablanica, BOSNIA AND HERZEGOVINA: The flood destroyed the whole village. pic.twitter.com/sv4ZCpGS8n— Neo (@petrovicsrb) October 5, 2024 ‘‘జబ్లానికా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో వరదలు పోటెత్తాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ’ అని ప్రభుత్వ అధికారి డార్కో జుకా తెలిపారు.📷: An aerial view shows the area destroyed by a landslide in Donja Jablanica, Bosnia, Saturday, Oct. 5, 2024.https://t.co/QmZXdIENx7 pic.twitter.com/1CC0JL8gyu— Voice of America (@VOANews) October 6, 2024 -
బెల్జీయంలో భారత రాయబారిగా పూరి
బెల్జీయంలో భారత రాయబారిగా మన్జీవ్ సింగ్ పూరి నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే కౌన్సిల్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్‌లో కూడా పూరి భారత రాయబారిగా విధులు నిర్వహించనున్నారని పేర్కొంది. ప్రస్తుతం పూరి ఐక్యరాజ్యసమితిలో భారత్ తరపున ఉప శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.1982 బ్యాచ్ ఇండియన్ ఫారన్ సర్వీస్‌కు చెందిన పూరి ఇప్పటి వరకు పలు దేశాల్లో భారత రాయబారిగా పని చేశారు. అలాగే హాంగేరిలోని భారత రాయబారి ఉన్న మలయ్ మిశ్రాను బొస్నియా అండ్ హెర్జిగోవినాలో నూతన రాయబారిగా విదేశాంగ శాఖ నియమించింది. అయితే మారిషస్‌లో భారత రాయబారిగా ఉన్న టీ పీ సీతారాంను యూఏఈలో భారత రాయబారిగా నియమిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీతారాం వచ్చే నెలలో ఆ నూతన బాధ్యతులు స్వీకరించనున్నారు.


