బెల్జీయంలో భారత రాయబారిగా పూరి | Manjeev Puri is new Indian envoy to Belgium, European Union | Sakshi
Sakshi News home page

బెల్జీయంలో భారత రాయబారిగా పూరి

Nov 13 2013 8:38 AM | Updated on Sep 2 2017 12:34 AM

బెల్జీయంలో భారత రాయబారిగా మన్జీవ్ సింగ్ పూరి నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

బెల్జీయంలో భారత రాయబారిగా మన్జీవ్ సింగ్ పూరి నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే కౌన్సిల్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్లో కూడా పూరి భారత రాయబారిగా విధులు నిర్వహించనున్నారని పేర్కొంది.  ప్రస్తుతం పూరి ఐక్యరాజ్యసమితిలో భారత్ తరపున ఉప శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.1982 బ్యాచ్ ఇండియన్ ఫారన్ సర్వీస్కు చెందిన పూరి ఇప్పటి వరకు పలు దేశాల్లో భారత రాయబారిగా పని చేశారు.



అలాగే హాంగేరిలోని భారత రాయబారి ఉన్న మలయ్ మిశ్రాను బొస్నియా అండ్ హెర్జిగోవినాలో నూతన రాయబారిగా విదేశాంగ శాఖ నియమించింది. అయితే మారిషస్లో భారత రాయబారిగా ఉన్న టీ పీ సీతారాంను యూఏఈలో భారత రాయబారిగా నియమిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీతారాం వచ్చే నెలలో ఆ నూతన బాధ్యతులు స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement