IPL 2023: Suryakumar Yadav Nimbu Prank On Tilak Varma Ahead Q2 Match Vs GT, Video Goes Viral - Sakshi
Sakshi News home page

#Surya-TilakVarma: తిలక్‌ వర్మను టీజ్‌ చేసిన సూర్యకుమార్‌.. వీడియో వైరల్‌

May 25 2023 4:42 PM | Updated on May 25 2023 5:09 PM

Suryakumar Yadav Nimbu Prank On Tilak Varma Ahead Q2 Match Vs GT - Sakshi

తిలక్‌ వర్మను టీజ్‌ చేసిన సూర్య (PC: MI)

IPL 2023- ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

బ్యాటింగ్‌లో గ్రీన్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, నిహాల్‌ వదేరాలు రాణించగా.. బౌలింగ్‌లో ఆకాశ్‌ మధ్వాల్‌ ఐదు వికెట్లతో చెలరేగి ముంబైని గెలిపించాడు. ఇక ముంబై ఇండియన్స్‌ శుక్రవారం(మే 26న) క్వాలిఫయర్‌-2 ఆడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం ముంబై జట్టు గురువారం బయల్దేరింది. 

ఈ నేపథ్యంలో ఫ్లైట్‌ జర్నీలో సూర్యకుమార్‌.. తిలక్‌ వర్మను టీజ్‌చేశాడు. ఎయిర్‌ హోస్టస్‌ను ఒక నిమ్మకాయ అడిగి.. దాని జ్యూస్‌ను నిద్రపోతున్న తిలక్‌ వర్మ నోటిలో పిండాడు. దెబ్బకు లేచి కూర్చున్న తిలక్‌ వర్మ ఏంటిది.. అన్నట్లుగా పేర్కొన్నాడు. దీంతో సూర్యకుమార్‌ సహా ఇతర ముంబై ఆటగాళ్లు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 'వరల్డ్‌కప్‌ ఉంది.. ప్లీజ్‌ ఇలాంటి రిస్క్‌లు వద్దు!'

Advertisement
 
Advertisement
Advertisement