
ఆస్ట్రేలియాతో ఐదో టీ20కు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 3(ఆదివారం)న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకున్న యువ భారత జట్టు.. నామమాత్రపు మ్యాచ్‌లోనూ సత్తాచాటాలాని ఉవ్విళ్లూరుతోంది.
ఈ క్రమంలో ఆఖరి పోరు కోసం సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు శనివారం బెంగళూరుకు చేరుకుంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా జట్టు కూడా బెంగళూరులో అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా ఈ మ్యాచ్‌లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు రింకూ సింగ్, అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో శ్రేయస్ అయ్యర్ భారత జట్టును నడిపించనున్నట్లు వినికిడి. ఇక వీరిముగ్గురి స్ధానాల్లో తిలక్ వర్మ, శివమ్ దుబే,వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆసీస్‌తో ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
VIDEO | India and Australia cricket teams reach Bengaluru ahead of final T20 match. pic.twitter.com/FoIKLCp3cI
— Press Trust of India (@PTI_News) December 2, 2023