శ్రీలంక జట్టుకు కొత్త కెప్టెన్‌.. ప్రకటన విడుదల | Sri Lanka name new Test skipper After De Silva Step Down | Sakshi
Sakshi News home page

శ్రీలంక జట్టుకు కొత్త కెప్టెన్‌.. ప్రకటన విడుదల

Oct 8 2026 3:52 PM | Updated on Oct 8 2026 4:03 PM

Sri Lanka name new Test skipper After De Silva Step Down

కుశాల్‌ మెండిస్‌ (PC: SLC)

శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కీలక ప్రకటన చేసింది. తమ టెస్టు జట్టు కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌ను నియమించినట్లు గురువారం ప్రకటించింది. ధనంజయ డి సిల్వ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన వెంటనే లంక బోర్డు కొత్త సారథిని ఖరారు చేసింది.

పాక్‌ టూర్‌తో ఆరంభం
పాకిస్తాన్‌తో నవంబరు 9 -21 మధ్య జరిగే సిరీస్‌తో కుశాల్‌ మెండిస్‌ లంక టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా రావల్పిండి, లాహోర్‌ వేదికగా శ్రీలంక- పాకిస్తాన్‌ రెండు టెస్టుల్లో తలపడతాయి. కాగా తాను తక్షణమే శ్రీలంక టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ధనంజయ డి సిల్వ గురువారం ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

కుశాల్‌కు అవకాశం
ఈ మేరకు తన రాజీనామా లేఖను శ్రీలంక సెలక్షన్‌ కమిటీకి పంపించాడు. ఈ నేపథ్యంలో లంక బోర్డు కుశాల్‌ మెండిస్‌ను అతడి స్థానంలో సారథిగా నియమించింది. ‘‘శ్రీలంక పురుషుల టెస్టు క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌ను నియమించామని చెప్పడానికి సంతోషిస్తున్నాము. 

గురువారం ఎస్‌ఎల్‌సీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది’’ అని ఎస్‌ఎల్‌సీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆష్లే డి సిల్వ ప్రకటన విడుదల చేశాడు.

పది శతకాలు బాదేశాడు
కాగా 31 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ శ్రీలంక తరఫున ఇప్పటి వరకు 75 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ కుడిచేతి వాటం ఆటగాడు టెస్టుల్లో ఇప్పటికి 4836 పరుగులు సాధించాడు. ఇందులో పది శతకాలు, 23 అర్ధ శతకాలు, ఒక డబుల్‌ సెంచరీ ఉన్నాయి.

ఇక శ్రీలంక వైట్‌బాల్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి మొత్తంగా 22 వన్డేలకు, మూడు టీ20 మ్యాచ్‌లకు అతడు సారథిగా వ్యవహరించాడు. పాకిస్తాన్‌ పర్యటనతో టెస్టు కెప్టెన్‌గానూ ప్రయాణం మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాడు.

చదవండి: IND vs WI: రెండో టీ20.. భారత తుదిజట్టులో మార్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement