యూఏఈ వేదికగా జరగనున్న మహిళల ఆసియాకప్-2026 టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ఆల్‌రౌండర్ చమి చమరి ఆటపట్టు సారథిగా వ్యవహరించనుండగా.. హర్షిత సమరవిక్రమ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.
ఇటీవల పాకిస్తాన్‌పై సెంచరీ బాదిన యువ బ్యాటర్ ఇమేషా దులాని జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకుంది. అదేవిధంగా పాక్ సిరీస్‌లో అదరగొట్టిన 17 ఏళ్ల యువ సంచలనం సంజన కవిందికు కూడా సెలక్టర్లు అవకాశమిచ్చారు. మరోవైపు పాక్‌తో సిరీస్‌కు జట్టులో చోటు కోల్పోయిన పేసర్ మిథాలి అయోధ్య తిరిగి రీఎంట్రీ ఇచ్చింది
సుగంధిక దాసనాయక, చాముడి ప్రబోద, చేతన విముక్తితో ఆమె బంతిని పంచుకోనుంది. కాగా ఈసారి ఆసియాకప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. శ్రీలంక డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గత ఎడిషన్ (2024) ఫైనల్లో భారత్‌ను ఓడించి తొలిసారి ఆసియా కప్ ట్రోఫీని శ్రీలంక ముద్దాడింది. ఈ ఖండాంతర టోర్నీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది.
శ్రీలంక జట్టు: చమరి ఆటపట్టు (కెప్టెన్), ఇమేషా దులానీ, సంజన కవిందీ, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ (వైస్ కెప్టెన్), కవిషా దిల్హరి, నీలక్షిక సిల్వా, హాసిని పెరీరా, కౌశిని నూతనంగన (వికెట్ కీపర్), దేవ్మీ విహంగ, సుగండిక కుమారి, చమ్దికా కుమారి కవింది, మిథాలీ అయోధ్య
చదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్


