‘టైమ్‌’ ప్రభావశీలుర జాబితాలో స్మృతి | Smriti Mandhana among the most influential sportspersons in Time magazine | Sakshi
Sakshi News home page

‘టైమ్‌’ ప్రభావశీలుర జాబితాలో స్మృతి

Jun 17 2026 4:09 AM | Updated on Jun 17 2026 4:09 AM

Smriti Mandhana among the most influential sportspersons in Time magazine

100 మంది క్రీడాకారుల్లో ఏకైక భారత ప్లేయర్‌

న్యూయార్క్‌: ప్రఖ్యాత ‘టైమ్‌’ మేగజీన్‌ ప్రకటించిన 100 మంది అత్యంత ప్రభావశీలుర క్రీడాకారుల జాబితాలో భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానకు చోటు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లు, కోచ్‌లతో పాటు క్రీడల అభివృద్ధి కోసం పాటుపడుతున్న వారికి ఇందులో ‘టైమ్‌’ స్థానం కల్పించింది. భారత్‌ నుంచి అటు పురుషుల, ఇటు మహిళల నుంచి ఈ జాబితాలో స్థానం దక్కిన ఏకైక ప్లేయర్‌ స్మృతి మంధాన కావడం విశేషం.

భారత టీమ్‌ వైస్‌ కెపె్టన్‌ అయిన స్మృతి మూడు ఫార్మాట్‌లలో సెంచరీ చేసిన మొదటి క్రికెటర్‌ కావడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక (17) సెంచరీలు సాధించిన రికార్డును కూడా నెలకొల్పింది. ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో వన్డేల్లో 1000కి పైగా పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె ఘనత సాధించిందని సొంతమని ‘టైమ్‌’ ప్రశంసించింది. 

స్మృతి సారథ్యంలో ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు రెండు సార్లు టైటిల్‌ సాధించింది. ఈ 100 మంది జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు మెస్సీ, రొనాల్డో, లెబ్రాన్‌ జేమ్స్, అల్‌కరాజ్, రోరీ మెక్‌లారాయ్, ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో, దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టుకు ప్రపంచ టెస్టు  చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) టైటిల్‌ అందించిన తెంబా బవుమా తదితరుల పేర్లు ఉన్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement