
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ధరించిన జెర్సీ నంబర్ 77 భారీ ధరకు అమ్ముడు పోయింది. ఈ మ్యాచ్ అనంతరం గిల్ తన జెర్సీని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ఫౌండేషన్ - రెడ్ రూత్ ఛారిటీకి ఇచ్చాడు. తాజాగా ఈ జెర్సీని బడ్స్ వేలంలో 4,600 పౌండ్ల(భారత కరెన్సీలో సుమారు 5.41 లక్షలు)కు కొనుగోలు చేశారు.
ఆ మ్యాచ్‌లో సేకరించిన అన్ని వస్తువులలోకంటే గిల్ జెర్సీకే అత్యధిక మొత్తం లభించింది. ఇందులో రెండు జట్ల ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీ, క్యాప్‌లు కూడా ఉన్నాయి. కాగా లార్డ్స్ టెస్టులో రెడ్ రూత్ ఛారిటీకి మద్దతుగా ఇరు జట్ల ఆటగాళ్లు రెండో రోజు ఆటలో ఎర్రటి క్యాప్‌లు ధరించి బరిలోకి దిగారు.
అప్పుడు సేకరించిన వస్తువులను తాజాగా రూత్ స్ట్రాస్ ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కోసం వేలం నిర్వహించారు. ఈ వేలంలో గిల్ జెర్సీతో పాటు జస్ప్రీత్ బుమ్రా ,రవీంద్ర జడేజా జెర్సీలు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. బుమ్రా, జడేజాల జెర్సీలు ఒక్కొక్కటి రూ.4 లక్షల 43 వేలకు సొంతం చేసుకున్నారు.
అదేవిధంగా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ జెర్సీలకు కూడా అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. రాహుల్ జెర్సీ రూ. 4.71 లక్షలకు అమ్ముడుపోగా.. రూట్ జెర్సీకి రూ.4.47 లక్షలు దక్కింది.
కాగా ఇంగ్లండ్ గడ్డపై శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా తన సిరీస్‌లోనే అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో గిల్ జెర్సీకి భారీ మొత్తం లభించింది.
ఏంటీ రూత్ ఫౌండేషన్..
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ స్ట్రాస్ స్మారకార్థం నిర్వహిస్తున్నారు. స్మోకింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం కల్పించడం, క్యాన్సర్ బాధితుల్లో అవగాహన పెంచడం సహా వ్యాధి తీవ్రతరమైన వారి కుటుంబాలకు ఎమోషనల్ సపోర్టునివ్వడంలో తోడ్పడటం ఈ ఫౌండేషన్ ధ్యేయం. అతడి భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.
చదవండి: NZ vs ZIM: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. టెస్టుల్లో అతి పెద్ద విజయం!