వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో ఓటమిపాలై బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ షాన్ మసూద్ వేలి గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మసూద్ గాయపడ్డాడు.
విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ బౌలింగ్‌లో ఓ రాకాసి బౌన్సర్ మసూద్ ఎడమచేతి చూపుడు వేలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో బాధపడుతూనే తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షలలో మసూద్ గాయం తీవ్రమైనది తేలింది.
ఈ క్రమంలోనే అతడిని రెండో టెస్టు నుంచి తప్పించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. షాన్ మసూద్ ఆగస్టు 19న ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌కు దూరమయ్యే అవకాశముంది. ఇక విండీస్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్ తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.
ఆదివారం నుంచి జరగనున్న రెండో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని బాబర్ సేన భావిస్తోంది. తుది జట్టులో షాన్ మసూద్‌కు బదులుగా అబ్దుల్లా షఫీక్, సౌద్ షకీల్‌లలో ఒకరికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు అన్‌క్యాప్డ్ బ్యాటర్ అవైస్ జఫర్ కూడా రేసులో ఉన్నాడు. కాగా తొలి టెస్ట్‌లో పాక్ పరాజయం పాలైనప్పటికి.. మసూద్ మాత్రం అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ దూరం కావడం పాక్‌కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి.
చదవండి: బ్రెజిల్‌తో భారత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. ఎప్పుడంటే?


