వెస్టిండీస్‌ సంచలన విజయం | Shai Hope century leads West Indies to victory over England in first ODI | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌ సంచలన విజయం

Dec 5 2023 6:29 AM | Updated on Dec 5 2023 6:29 AM

Shai Hope century leads West Indies to victory over England in first ODI - Sakshi

నార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): వెస్టిండీస్‌ వన్డే కెప్టెన్‌ షై హోప్‌ (83 బంతుల్లో 109 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో విండీస్‌ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా...జాక్‌ క్రాలీ (48), ఫిల్‌ సాల్ట్‌ (45), స్యామ్‌ కరన్‌ (38) రాణించారు. మోతీ, ఒషాన్, షెఫర్డ్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెస్టిండీస్‌ 48.5 ఓవర్లలో 6 వికెట్లకు 326 పరుగులు చేసి విజయాన్నందుకుంది.

వన్డేల్లో విండీస్‌కు ఇది రెండో అతి పెద్ద లక్ష్యఛేదన కావడం విశేషం. 39 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 214/5 వద్ద విండీస్‌కు విజయావకాశాలు తక్కువగా కనిపించాయి. అయితే రొమారియో షెఫర్డ్‌ (28 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌ పరిస్థితి మార్చింది. హోప్, షెఫర్డ్‌ ఆరో వికెట్‌కు 51 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. చివరి 2 ఓవర్లలో 19 పరుగులు చేయాల్సిన దశలో స్యామ్‌ కరన్‌ వేసిన ఓవర్లో హోప్‌ 3 సిక్సర్లు బాది ఆట ముగించాడు. ఈ క్రమంలో వన్డేల్లో హోప్‌ 16వ సెంచరీ పూర్తయింది. చివరి 9.5 ఓవర్లలో విండీస్‌ 112 పరుగులు సాధించింది. మరోవైపు స్యామ్‌ కరన్‌ వన్డేల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు (98) ఇచి్చన బౌలర్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement