breaking news
Sir Vivian Richards
-
చరిత్ర సృష్టించిన పంత్.. ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు బద్దలు
భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ధనాధన్ ఆటతో అలరిస్తున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. రెండో టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు.ఈ క్రమంలో బెన్ స్టోక్స్ (Ben Stokes) పేరిట ఉన్న ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు (World Record)ను పంత్ బద్దలు కొట్టాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రిషభ్ పంత్ శతకాలతో చెలరేగాడు.వరుసగా రెండు శతకాలుతొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. అయితే, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం మొదలైన రెండో టెస్టులో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆరంభంలో విఫలమయ్యాడు.దూకుడుగా ఆడుతూరెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 25 పరుగులు చేసిన పంత్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనలోని దూకుడైన ఆటను మరోసారి వెలికితీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆట భోజన విరామ సమయానికి పంత్ 35 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 41 పరుగులతో అజేయంగా ఉన్నాడు.ఈ క్రమంలోనే పంత్ స్టోక్స్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్‌లో టెస్టు ఫార్మాట్లో మొత్తంగా 23 సిక్సర్లు పూర్తి చేసుకున్న పంత్.. విదేశీ గడ్డ(ఒకే దేశం)పై అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు బెన్ స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు బాదాడు. ఇక ఇంగ్లండ్‌పై పంత్ తర్వాత అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో పర్యాటక బ్యాటర్‌గా.. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ (16 సిక్సర్లు) నిలిచాడు.విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు🏏రిషభ్ పంత్ (ఇండియా)- ఇంగ్లండ్‌పై 23 సిక్సర్లు🏏బెన్ స్టోక్స్ (ఇండియా)- సౌతాఫ్రికాపై 21 సిక్సర్లు🏏మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)- టీమిండియాపై 19 సిక్సర్లు🏏వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- ఇంగ్లండ్‌పై 16 సిక్సర్లు🏏హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్)- న్యూజిలాండ్‌పై 16 సిక్సర్లు.భారత్ 177/3 @ లంచ్ బ్రేక్ఇక ఓవర్‌నైట్ స్కోరు 64/1తో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి 38 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (55) చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 24, పంత్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180) కలుపుకొని భారత జట్టుకు ఇంగ్లండ్‌పై 357 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.పంత్ 65 పరుగులు చేసి...కాగా 51 బంతుల్లోనే 50 పరుగులు చేసిన పంత్.. 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బెన్ డకెట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన చిచ్చరపిడుగుIt’s Rishabh’s world and we’re just living in it! 😌#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/d1V9UBz17b— Sony Sports Network (@SonySportsNetwk) July 5, 2025 -
డ్రెస్సింగ్ రూమ్ ‘బెస్ట్ ఫీల్డర్’గా సూర్య.. ఈసారి ‘గెస్ట్’ ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అయితే ప్రతీ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను ఈసారి స్టార్ బ్యాటర్ సుర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచినందుకు సూర్యకు ఉత్తమ ఫీల్డింగ్ మెడల్ అవార్డు వరించింది. కాగా ప్రత్యేకంగా గెస్ట్‌ను పిలిచి ఈ అవార్డు అందజేయడం సాంప్రదాయకంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి అవార్డు అందజేసేందుకు వెస్టిండీస్ గ్రేట్ ,దిగ్గజ బ్యాటర్ సర్ వివియన్ రిచర్డ్స్‌ను భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ తీసుకు వచ్చాడు. వివియన్ రిచర్డ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే భారత టీమ్ మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతించారు. వివియన్ రిచర్డ్స్ చేతుల మీదగా సూర్య బెస్ట్ ఫీల్డర్ అవార్డును అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
వెస్టిండీస్ సంచలన విజయం
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్ వన్డే కెప్టెన్ షై హోప్ (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో విండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా...జాక్ క్రాలీ (48), ఫిల్ సాల్ట్ (45), స్యామ్ కరన్ (38) రాణించారు. మోతీ, ఒషాన్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెస్టిండీస్ 48.5 ఓవర్లలో 6 వికెట్లకు 326 పరుగులు చేసి విజయాన్నందుకుంది. వన్డేల్లో విండీస్‌కు ఇది రెండో అతి పెద్ద లక్ష్యఛేదన కావడం విశేషం. 39 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 214/5 వద్ద విండీస్‌కు విజయావకాశాలు తక్కువగా కనిపించాయి. అయితే రొమారియో షెఫర్డ్ (28 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్ పరిస్థితి మార్చింది. హోప్, షెఫర్డ్ ఆరో వికెట్‌కు 51 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. చివరి 2 ఓవర్లలో 19 పరుగులు చేయాల్సిన దశలో స్యామ్ కరన్ వేసిన ఓవర్లో హోప్ 3 సిక్సర్లు బాది ఆట ముగించాడు. ఈ క్రమంలో వన్డేల్లో హోప్ 16వ సెంచరీ పూర్తయింది. చివరి 9.5 ఓవర్లలో విండీస్ 112 పరుగులు సాధించింది. మరోవైపు స్యామ్ కరన్ వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు (98) ఇచి్చన బౌలర్‌గా నిలిచాడు. -
విరాట్ సెంచరీలు ఒక్కటీ చూడలేదు..!
నార్త్ సౌండ్(ఆంటిగ్వా): వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(200) వీర విహారానికి విండీస్ మాజీ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ ఫిదా అయిపోయాడు. ఈ విషయాన్ని రిచర్డ్స్ స్వయంగా వెల్లడించాడు. 'వివియన్ రిచర్డ్స్ ఇంటర్నేషనల్ స్డేడియంలో ప్రాక్టీస్ సెషన్లో ఉన్న సమయంలో భారత ఆటగాళ్లను నేను కలిశాను. ఆ సందర్భంగా విరాట్ కోహ్లీకి నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను. అయితే ఈ విధంగా డబుల్ సెంచరీ సాధిస్తాడని మాత్రం అసలు ఊహించలేదు' అని రిచర్డ్స్ పేర్కొన్నాడు. బ్యాట్స్‌మన్ గా కోహ్లీ ఇన్నింగ్స్ ను ఆస్వాదించానని, సంప్రదాయ షాట్లతో అలరించాడని కోహ్లీని కొనియాడాడు. తాను కూడా విండీస్ బయట తొలి డబుల్ సెంచరీ సాధించానని, ఇప్పుడు విరాట్ అదే పని చేసి చూపించాడని చెప్పాడు. నిజం చెప్పాలంటే విదేశాలలో ఆడుతున్నామంటే ఆటగాళ్ల మీద కాస్త ఒత్తిడి ఉంటుంది. అయితే ఏకాగ్రతతో ఏదైనా సాధ్యం చేయవచ్చని కోహ్లీ నిరూపించాడు. విరాట్ ఇన్నింగ్స్ చూడని వారు చాలా కోల్పోయారు, నాకు అవకావం లేదు.. కోహ్లీ సెంచరీ చేయడం తొలిసారి చూశాను. అది కూడా ఏకంగా డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ అని విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తెలిపాడు. -
టీమిండియాకు సడన్ సర్ ప్రైజ్
ప్రస్తుతం వెస్డిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు వెస్డిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ సడన్ సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. తమను కలిసేందుకు స్వయంగా రిచర్డ్స్ లాంటి దిగ్గజ ఆటగాడు రావడంతో భారత క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంటిగ్వాలో వివియన్ రిచర్డ్స్ స్డేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లను సోమవారం కలవడంతో పాటు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. విండీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైన టీమిండియా ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమతో విలువైన సమయాన్ని కేటాయించిన విండీస్ మాజీ ఆటగాడికి కోహ్లీ, రహానే, మురళీ విజయ్, రాహుల్, ధావన్, స్టూవర్ట్ బిన్నీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలను ప్రత్యేకంగా అభినందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో సెంచరీల మోత మోగించిన విరాట్ ను మెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ దూకుడైన ఆటతీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నాడు. కూల్ గా ఉంటూనే తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించే రహానేను ప్రశంసించాడు. స్టూవర్ట్ బిన్నీతో మాట్లాడుతూ అతడి తండ్రి మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీతో పాటు 1983 ప్రపంచకప్ రోజులను రిచర్డ్స్ గుర్తుచేసుకున్నాడు.