ఉత్కంఠ సమరంలో చివరి బంతికి విజయం.. వైపర్స్‌ను గెలిపించిన అఫ్రిది | ILT20 2024: Shaheen Afridi Has Secured Victory For Desert Vipers Against MI Emirates - Sakshi
Sakshi News home page

ఉత్కంఠ సమరంలో చివరి బంతికి విజయం.. వైపర్స్‌ను గెలిపించిన అఫ్రిది

Published Wed, Jan 31 2024 10:58 AM | Last Updated on Wed, Jan 31 2024 11:19 AM

Shaheen Afridi Has Secured Victory For Desert Vipers In A Last Ball Thriller Against MI Emirates In ILT20 2024 - Sakshi

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో నిన్న మరో రసవత్తర సమరం జరిగింది. ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్‌ వైపర్స్‌ చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి బంతికి వైపర్స్‌ మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో షాహీన్‌ అఫ్రిది (12 బంతుల్లో 17 నాటౌట్‌; ఫోర్‌) కావాల్సిన పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఫలితంగా వైపర్స్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో వైపర్స్‌కు ఇది రెండో విజయం. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ ఎమిరేట్స్‌.. మొహమ్మద్‌ ఆమీర్‌ (4-0-26-3), లూక్‌ వుడ్‌ (4-0-32-2), మతీష పతిరణ (4-0-32-2), హసరంగ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎమిరేట్స్‌ ఇన్నింగ్స్‌లో టిమ్‌ డేవిడ్‌ (28), అకీల్‌ హొసేన్‌ (24), అంబటి రాయుడు (23) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు.

అనంతరం నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన వైపర్స్‌.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహీన్‌ అఫ్రిది చివరి బంతికి మూడు పరుగుల తీసి వైపర్స్‌ను గెలిపించాడు. బౌల్ట్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. అఫ్రిది, లూక్‌ వుడ్‌ (6 నాటౌట్‌) సాయంతో తన జట్టును గెలిపించాడు.

వైపర్స్‌ ఇన్నింగ్స్‌లో షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (35), హసరంగ (26), ఆజమ్‌ ఖాన్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిద్‌ ఖాన్‌ 3 వికెట్లతో వైపర్స్‌ను ఇబ్బంది పెట్టగా.. ఫజల్‌ హక్‌ ఫారూకీ, డ్వేన్‌ బ్రావో తలో 2 వికెట్లు, సలామ్‌కీల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.  
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement