రాణించిన భారత బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే? | Shafali Verma Top-Scores As India Post 158-7 vs SA | Sakshi
Sakshi News home page

రాణించిన భారత బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే?

Jun 21 2026 8:47 PM | Updated on Jun 21 2026 8:48 PM

Shafali Verma Top-Scores As India Post 158-7 vs SA

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో మాంచెస్టర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న గ్రూపు-ఎ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 

షెఫాలీ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీప్తి శర్మ(29), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(24), మంధాన(17) పర్వాలేదనిపించారు. భారత్‌కు మంచి ఆరంభం లభించినప్పటికి మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. 

దక్షిణాఫ్రికా బౌలర్లలో కాప్‌, ఇస్మాయల్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మల్బా, అయబోంగ ఖకా, నడైన్‌ డిక్లార్క్‌ తలా వికెట్‌ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement