మరీ ఇంత చీప్‌గా ఔట్ అవుతావా..? గంభీర్ రియాక్షన్ వైరల్‌ | Sai Sudharsan debut ends cheaply, departs for duck in ENG vs IND 1st Test | Sakshi
Sakshi News home page

IND vs ENG: మరీ ఇంత చీప్‌గా ఔట్ అవుతావా..? గంభీర్ రియాక్షన్ వైరల్‌

Jun 20 2025 7:03 PM | Updated on Jun 20 2025 7:35 PM

Sai Sudharsan debut ends cheaply, departs for duck in ENG vs IND 1st Test

టీమిండియా యువ ఆటగాడు సాయిసుదర్శన్ తన టెస్టు కెరీర్‌ను పేలవంగా ఆరభించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి  టెస్టులో అరంగేట్రం చేసిన సుదర్శన్ తీవ్ర నిరాశపరిచాడు.  మొదటి ఇన్నింగ్స్‌లో  4 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి వి​కెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

అయితే సుదర్శన్ క్రీజులో వచ్చినప్పటినుంచే ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. సుదర్శన్‌ తను ఎదుర్కొన్న తొలి బంతికే బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత తొలి రోజు లంచ్‌కు ముందు ఓవర్ వేసిన స్టోక్స్ బౌలింగ్‌లో జైశ్వాల్ సింగిల్ తీసి సుదర్శన్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. స్టోక్స్‌ రెండో బంతిని సుదర్శన్‌కు లెగ్ సైడ్ డెలివరీగా సంధించాడు.

ఆ బంతిని సుదర్శన్ ఆడకుండా వదిలేశాడు. అనంతరం మూడో బంతిని కూడా అదేవిధంగా స్టోక్స్ సంధించాడు. అయితే ఈసారి మాత్రం సుదర్శన్ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. ఆ బంతిని సుదర్శన్ డౌన్‌ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. ​​బ్యాట్‌కు తాకి  డౌన్‌ది లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని వికెట్ కీపర్ స్మిత్ డైవ్ చేసి క్యాచ్‌ను పూర్తి చేశాడు.

దీంతో నిరాశతో సుదర్శన్ పెవిలియన్‌కు చేరాడు. సుదర్శన్ డకౌట్ కావడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడి​యో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

అయితే ఐపీఎల్‌లో అదరగొట్టిన సుదర్శన్‌.. తన టెస్టు అరంగేట్రంలో ఈ తరహా ప్రదర్శన చేయడం అభిమానులు జీర్ణించుకులేకపోతున్నారు. మరి ఇంత చీప్‌గా ఔట్ అవుతావా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. 34 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

క్రీజులో జైశ్వాల్‌(49), శుబ్‌మన్ గిల్‌(31)  ఉన్నారు. ఇక  ఈ మ్యాచ్‌లో డకౌటైన సుదర్శన్‌ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.  2000 సంవత్సరం త‌ర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో టాప్‌-7లో వచ్చి అరంగేట్రంలోనే డకౌట్‌ అయిన నాలుగో భారత ప్లేయర్‌గా సుదర్శన్ నిలిచాడు.
అరంగేట్ర టెస్టులో డకౌటైన భారత ఆటగాళ్లు వీరే (2000 సంవత్సరం నుంచి)
అజయ్ రాత్ర- 2002
వృద్ధిమాన్ సాహా- 2010
హనుమ విహారి- 2018
సాయి సుదర్శన్- 2025*

 

 

Advertisement
 
Advertisement
Advertisement