
మాంచెస్టర్ టెస్ట్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 200 పరుగుల మార్కును దాటింది. 46 పరుగుల వ్యవధిలో కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58), శుభ్‌మన్ గిల్ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను సాయి సుదర్శన్ (46), రిషబ్ పంత్ (28) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయమైన 61 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు.
సాయి సుదర్శన్ ఎంతో ఓపికగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తుండగా.. పంత్ తనదైన శైలిలో ధాటిగా ఆడుతున్నాడు. 65 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 201/3గా ఉంది. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్‌కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్‌కు.. శుభ్‌మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్‌కు దక్కింది.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్‌కు డు ఆర్ డైగా మారింది.
తుది జట్లు..
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.