SA Vs PAK: నిప్పులు చెరిగిన ప్యాటర్సన్, బాష్‌.. పాకిస్తాన్‌ 211 ఆలౌట్‌ | SA Vs PAK 1st Test: Paterson, Bosch Lead South Africa Boxing Day Domination, Check More Details Inside | Sakshi
Sakshi News home page

SA Vs PAK 1st Test: నిప్పులు చెరిగిన ప్యాటర్సన్, బాష్‌.. పాకిస్తాన్‌ 211 ఆలౌట్‌

Dec 27 2024 10:09 AM | Updated on Dec 27 2024 11:49 AM

SA VS PAK 1st Test: Paterson, Bosch Lead South Africa Boxing Day Domination

సెంచూరియన్‌: అరంగేట్రం చేసిన ‘బాక్సింగ్‌ డే’ టెస్టును దక్షిణాఫ్రికా సీమర్‌ కార్బిన్‌ బాష్‌ (4/63) చిరస్మరణీయం చేసుకున్నాడు. సహచర పేసర్‌ డేన్‌ పాటర్సన్‌ (5/61)తో కలిసి పాకిస్తాన్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తొలి టెస్టు మొదలైన రోజే ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 57.3 ఓవర్లలో 211 పరుగుల వద్ద ఆలౌటైంది. 

మిడిలార్డర్‌ బ్యాటర్‌ కమ్రాన్‌ గులామ్‌ (54; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే రాణించి సఫారీ బౌలర్లను ఎదుర్కొని అర్ధసెంచరీ సాధించాడు. మిగిలిన వారిలో అమీర్‌ జమాల్‌ (28; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రిజ్వాన్‌ (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. జోర్జి (2), రికెల్టన్‌ (8), స్టబ్స్‌ (9) సింగిల్‌ డిజిట్‌కే నిష్క్రమించినా... ఓపెనర్‌ మార్క్రమ్‌ (47 బ్యాటింగ్‌; 9 ఫోర్లు) పాక్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అతనితో పాటు కెప్టెన్‌ బవుమా (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement