అక్కడ ఉంది రోహిత్‌.. ట్రాప్‌లో పడకుండా ఉంటాడా! | Rohit Sharma Strategy Behind Rishabh Pant Loose Wicket Negligence | Sakshi
Sakshi News home page

IPL 2022: అక్కడ ఉంది రోహిత్‌.. ట్రాప్‌లో పడకుండా ఉంటాడా!

Mar 27 2022 6:19 PM | Updated on Mar 27 2022 6:42 PM

Rohit Sharma Strategy Behind Rishabh Pant Loose Wicket Negligence - Sakshi

ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు సరైన ఆరంభం లభించలేదు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంత్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు. పంత్‌కున్న షార్ట్‌ బాల్‌ బలహీనతను ముంబై ఇండియన్స్‌ పసిగట్టేసింది. అయితే దీని వెనుక రోహిత్‌ శర్మ హస్తం ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టైమల్‌ మిల్స్‌ మొదటి బంతిని వైడ్‌ వేశాడు. రెండో బంతి వేయడానికి ముందు రోహిత్‌ ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు.

రోహిత్‌ ముందే ఊహించాడేమో తెలియదు కానీ మిల్స్‌ రెండో బంతి విసరడానికి ముందే టిమ్‌ డేవిడ్‌ను థర్డ్‌మన్‌ దిశలో ఉంచాడు. కాగా టైమల్‌ మిల్స్‌ ఎక్స్‌ట్రా బౌన్స్‌తో విసిరిన బంతిని పంత్‌ థర్డ్‌మన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు.అంతే బంతి నేరుగా వెళ్లి టిమ్‌ డేవిడ్‌ చేతిలో పడింది. పంత్‌ బలహీనత తెలిసిన రోహిత్‌ సంబరాల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పంత్‌ ఔట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

చదవండి: IPL 2022: కుల్దీప్‌.. ఎన్నాళ్లకు అదరగొట్టావయ్యా

Dwayne Bravo: ఐపీఎల్‌లో డ్వేన్‌ బ్రావో సరికొత్త చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement