
రోహిత్ శర్మ(ఫైల్ ఫోటో)
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా డిసెంబర్ 26 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ బ్యాక్సింగ్ డే టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అతడు తిరిగి తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే తన ప్రాక్టీస్ తిరిగి మొదలుపెట్టిన హిట్‌మ్యాన్.. పార్ట్ టైమ్ బౌలర్ దేవ్‌దత్త్ పడిక్కల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు "ఏంటి రోహిత్ భయ్యా అతడి బౌలింగ్‌లో కూడా ఔట్ అయ్యావు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఒకే ఒక్క హాఫ్ సెంచరీ..
కాగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన రోహిత్ శర్మ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం హిట్‌మ్యాన్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఒక్క సిరీస్ మాత్రమే కాకుండా గత ఏడాదిగా రోహిత్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.
తనచివరి 10 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అందులో ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే రోహిత్ పరిమితమయ్యాడు. కనీసం ఆస్ట్రేలియాతో ఆఖరి రెండు మ్యాచ్‌లలోనైనా రోహిత్ రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.
Rohit Sharma got beaten by Part-time Bowler Devdutt Padikkal in the nets 🥲 pic.twitter.com/6iGlPXO6Nl
— Jyotirmay Das (@dasjy0tirmay) December 22, 2024