పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టుల్లోనూ బాబర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
తాజాగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో బాబర్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల సిరీస్‌లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు. ఈ క్రమంలో బాబర్ ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడిని జట్టు నుంచి తప్పించాలని పాక్ మాజీలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే మరొక పాకిస్తాన్ క్రికెటర్ సోహైబ్ మక్సూద్ మాత్రం బాబర్‌కు మద్దతుగా నిలిచాడు. బాబర్ వరల్డ్‌క్లాస్ ప్లేయర్ అని, అతడు తిరిగి తన ఫామ్‌ను అందుకుంటాడని మక్సూద్ థీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా భారత కెప్టెన్ రోహిత్ శర్మతో ఆజంను అతడు పోల్చాడు.
"రోహిత్ శర్మ తన వయస్సు 30 ఏళ్లు దాటిన తర్వాత 35 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. బాబర్‌కు ఇంకా కేవలం 29 ఏళ్లు మాత్రమే. అతడికి ఇంకా చాలా క్రికెట్ ఆడే సత్తా ఉంది.
కాబట్టి బాబర్ దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇటువంటి సమయంలోనే ప్రశాంతంగా ఉండాలి. కచ్చితంగా అతడు తిరిగి తన రిథమ్‌ను పొందుతాడని" మక్సూద్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా పాకిస్తాన్ స్వదేశంలో తమ తదుపరి సవాల్‌కు సిద్దమవుతోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment