
పాదం గాయం నుంచి కోలుకోని వికెట్ కీపర్
రేపు టీమిండియాను ఎంపిక చేయనున్న కమిటీ
న్యూఢిల్లీ: భారత స్టార్ వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన పంత్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం వల్లే కరీబియన్ జట్టుతో ఆడటం లేదు. జూలైలో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా అతని ఎడమ కాలి పాదానికి గాయమైంది. ప్రస్తుతం అతను బెంగళూరులోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలోని పునరావాస శిబిరంలో ఉన్నాడు.
వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే జట్టు ఎంపిక కోసం రేపు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఇంగ్లండ్‌లో జరిగిన టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీలో పాల్గొన్న భారత జట్టుకు పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. నాలుగో టెస్టులో గాయం వల్ల అతని స్థానంలో ఎన్. జగదీశన్‌ను ఐదో టెస్టుకు తీసుకున్నారు. కానీ తుది జట్టులో మాత్రం అతనికి చోటు దక్కలేదు. ప్రస్తుతం స్ట్రెంత్–కండిషనింగ్ క్యాంపులో ఉన్న రిషభ్‌ను బోర్డు వైద్యసిబ్బంది పర్యవేక్షిస్తోంది.
అయితే అతను జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడనే నిర్దిష్టమైన సమాచారాన్ని వైద్య సిబ్బంది వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలో అతిత్వరలో జరిగే విండీస్ సిరీస్ సహా ఆ్రస్టేలియా పర్యటనకు సైతం అతను దూరమయ్యే అవకాశాలున్నాయి. ఆసీస్, భారత్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టులో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్‌ల పేర్లను సెలక్షన్ కమిటీ పరిశీలించనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్‌లో భాగంగా భారత్, విండీస్‌ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు వచ్చే నెల 2న అహ్మదాబాద్‌లో మొదలవుతుంది.