క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక | Rashmika in the quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక

Nov 24 2023 5:05 AM | Updated on Nov 24 2023 5:05 AM

Rashmika in the quarter final - Sakshi

మహిళల ప్రపంచ టెన్నిస్‌ టూర్‌ టోర్నిలో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికసింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నిలో గురువారం జరిగిన సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 21 ఏళ్ల రష్మిక4–6, 7–5, 7–5తో నాలుగో సీడ్‌ వైదేహి (గుజరాత్‌)ను ఓడించింది. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మికనాలుగు ఏస్‌లు సంధించింది.

ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన రష్మికతన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్‌) జోడీ 6–0, 6–3తో కశిష్‌ భాటియా–వన్షిత (భారత్‌) జంటపై  నెగ్గింది. హైదరాబాద్‌కే చెందిన యడ్లపల్లి ప్రాంజల పోరాటం ఈ టోర్నిలో ముగిసింది. సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రాంజల 4–6, 3–6తో రుతుజా భోస్లే (భారత్‌) చేతిలో ఓడిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement