source: BCCI X
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనతలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా (89 ఇన్నింగ్స్‌లు) ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగో రోజు పంత్ (రెండో ఇన్నింగ్స్‌లో) ఈ మైలురాళ్లను అందుకున్నాడు.
గిల్‌క్రిస్ట్ రికార్డు బద్దలు
పంత్‌కు ముందు టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. గిల్‌క్రిస్ట్ 130 ఇన్నింగ్స్‌ల్లో 100 సిక్సర్లు పూర్తి చేశాడు.
100 సిక్సర్లు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్
పంత్‌తో కలిపి టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు నలుగురు బ్యాటర్లు మాత్రమే 100 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నారు.
బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) – 138 సిక్సర్లు
బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) – 107 సిక్సర్లు
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 100 సిక్సర్లు
రిషబ్ పంత్ (భారత్) – 100 సిక్సర్లు
పంత్ ఫిఫ్టి
ఈ ఇన్నింగ్స్‌లో పంత్ 69 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్ కారణంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్ (193 ఆలౌట్) శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
భారత రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌తో పాటు కేఎల్ రాహుల్ (35), దేవదత్ పడిక్కల్ (44) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 3, లహీరు కుమార 2, కేశర నువంత ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినుష (100) అద్భుత సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. దినుషకు నిరోషన్ డిక్వెల్లా (80) సహకరించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (167) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో జయసూర్య 4, నువంత 3, అశిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు.


