
అక్టోబర్ 1 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే ఇరానీ కప్ (Irani Cup) 2025 కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest of India) జట్టును ఇవాళ (సెప్టెంబర్ 25) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా రజత్ పాటిదార్ (Rajat patidar) ఎంపిక కాగా, అతనికి డిప్యూటీగా (Vice Captain) రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) నియమితుడయ్యాడు.
ఈ జట్టులో అభిమన్యు ఈశ్వరన్, ఇషాన్ కిషన్, ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్ లాంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. తొలుత ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas iyer) కెప్టెన్‌గా అనుకున్నారు. అయితే అతను రెడ్ బాల్ క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం కోరడంతో ఎంపిక చేయలేదు. ఆసీస్-ఏతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే (తొలి మ్యాచ్ తర్వాత) శ్రేయస్ వైదొలిగాడు.
రెస్ట్ ఆఫ్ ఇండియా వర్సెస్ విదర్భ
ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు రంజీ ఛాంపియన్ విదర్భతో (Vidarbha) తలపడనుంది. గతేడాది ముంబై (అప్పటి రంజీ ఛాంపియన్) చేతిలో ఓటమి పాలైన రెస్ట్ ఆఫ్ ఇండియా, ఈసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
రెస్ట్ ఆఫ్ ఇండియా: రజత్ పాటిదార్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఆర్యన్ జుయల్ (వికెట్‌కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యష్ ధుల్, షేక్ రషీద్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), తనుష్ కోటియన్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్, అన్షుల్ కంబోజ్, సరాన్ష్ జైన్
మూడో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న విదర్భ
2017-18, 2018-19 సీజన్లలో ఇరానీ కప్ గెలిచిన విదర్భ జట్టు, మూడో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు అక్షయ్ వాద్కర్ కెప్టెన్‌గా, గత రంజీ సీజన్‌లో 960 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన యశ్ రాథోడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.
విదర్భ: అక్షయ్ వాద్కర్ (కెప్టెన్ & వికెట్‌కీపర్), యశ్ రాథోడ్ (వైస్ కెప్టెన్), అథర్వ తైడే, అమన్ మొఖాడే, డానిష్ మాలేవార్, హర్ష్ దూబే, పార్థ్ రేఖడే, యశ్ ఠాకూర్, నచికేత్ భూతే, దర్శన్ నల్కండే, ఆదిత్య ఠాకరే, అక్షయ్ కర్నేవార్, యష్ కదమ్, శివమ్ దేశ్‌ముఖ్ (వికెట్‌కీపర్), ప్రఫుల్ హింగే, ధ్రువ్ షోరే
చదవండి: BCCI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్రకటన.. అతడిపై వేటు