భారత అండర్‌–19 జట్టులో ప్రతీక్ష | Pratiksha in the Indian Under 19 team | Sakshi
Sakshi News home page

భారత అండర్‌–19 జట్టులో ప్రతీక్ష

Jun 14 2026 4:09 AM | Updated on Jun 14 2026 4:09 AM

Pratiksha in the Indian Under 19 team

సాక్షి, హైదరాబాద్‌: శ్రీలంకతో జరిగే మహిళల అండర్‌–19 వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన వి.ప్రతీక్ష ఎంపికైంది. భవికా అహిరే నేతృత్వంలో బరిలోకి దిగే 15 మంది సభ్యుల టీమ్‌లో ప్రతీక్షకు అవకాశం దక్కింది. నగరంలోని మీర్‌ అకాడమీలో కోచ్‌లు ముస్తఫా అలీ, వసీం అలీ వద్ద ప్రతీక్ష శిక్షణ పొందుతోంది. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడంతో ఆమె ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించారు.  

జూన్‌ 30, జులై 3, 6 తేదీల్లో భారత్, శ్రీలంక టీమ్‌ల మధ్య పుదుచ్చేరిలో మూడు వన్డేలు జరుగుతాయి.  భారత అండర్‌–19 మహిళల జట్టు: భవికా అహిరే (కెప్టెన్‌), ఇరా జాదవ్, దియా యాదవ్, ఈశ్వరి, వి.ప్రతీక్ష, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పలక్, మహక్, కాశ్వీ, విధి పర్మార్, గౌరి గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె.దీక్ష.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement