గుజరాత్‌పై పట్నా పైచేయి | Patna has the upper hand over Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌పై పట్నా పైచేయి

Dec 8 2023 4:02 AM | Updated on Dec 8 2023 4:02 AM

Patna has the upper hand over Gujarat - Sakshi

అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న గుజరాత్‌ జెయింట్స్‌ జట్టుకు పట్నా పైరేట్స్‌ బ్రేక్‌ వేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ 33–30 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించింది.

ఈ లీగ్‌లో పట్నాకిది వరుసగా రెండో విజయంకాగా... గుజరాత్‌ జట్టుకిది తొలి పరాజయం. గుజరాత్‌తో మ్యాచ్‌లో పట్నా సమష్టి ఆటతో రాణించింది. పట్నా పైరేట్స్‌ తరఫున సుధాకర్‌ (6 పాయింట్లు), సచిన్‌ (4), నీరజ్‌ కుమార్‌ (4), అంకిత్‌ (4), సందీప్‌ కుమార్‌ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. గుజరాత్‌ తరఫున రాకేశ్‌ 11 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా ఫలితం లేకపోయింది.

అంతకుముందు బెంగాల్‌ వారియర్స్, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 28–28తో ‘డ్రా’గా ముగిసింది. బెంగాల్‌ తరఫున శ్రీకాంత్‌ జాదవ్‌ (7), నితిన్‌ కుమార్‌ (5), మణీందర్‌ సింగ్‌ (4)... జైపూర్‌ తరఫున భవాని రాజ్‌పుత్‌ (10) అర్జున్‌ దేశ్వాల్‌ (6) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్‌ ఢిల్లీ; పుణేరి పల్టన్‌తో యు ముంబా తలపడతాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement