పాకిస్తాన్‌ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్‌ క్రికెట్‌లోనే తొలి జట్టుగా | Sakshi
Sakshi News home page

PAK vs AUS: పాకిస్తాన్‌ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్‌ క్రికెట్‌లోనే తొలి జట్టుగా

Published Wed, Dec 27 2023 11:45 AM

Pakistan Create Embarrassing Record In A Test Innings  - Sakshi

మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 318 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో మార్నస్‌ లాబుషేన్‌ 63 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాక్‌ బౌలర్లలో అమీర్‌ జమాల్‌ మూడు వికెట్లతో అదరగొట్టగా.. షాహీన్‌ అఫ్రిది, మీర్‌ హంజా హసన్‌ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

అయితే తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ ఏకంగా ఎక్స్‌ట్రాస్‌ రూపంలో ఏకంగా 52 అదనపు పరుగులను సమర్పించుకుంది. తద్వారా అత్యంత చెత్త రికార్డును పాకిస్తాన్‌ తమ పేరిట లిఖించుకుంది. చారిత్రత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జట్టుగా పాక్‌ రికార్డులకెక్కింది. పాకిస్తాన్‌ సమర్పించుకున్న ఎక్స్‌ట్రాస్‌లో 15 వైడ్‌లు, 20 బైలు ఉన్నాయి. 
చదవండి: IND vs SA: 'అతడు అన్‌ఫిట్.. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగా కూడా పనికిరాడు'

Advertisement
 
Advertisement