
వెస్టిండీస్ పర్యటనను పాకిస్తాన్ ఘనంగా ఆరంభించింది. ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో 14 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హసన్ నవాజ్(24), ఫఖార్ జమాన్(28) రాణించారు. విండీస్ బౌలర్లలో షెమార్ జోషఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్, షెఫర్డ్, అకిల్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు.
టాపర్డర్ ఫెయిల్..
అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్‌కు ఓపెనర్లు జాన్సెన్ చార్లెస్(35), జ్యువెల్ ఆండ్రూ(35) 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే విండీస్ ఒకే ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 12 ఓవర్ వేసిన స్పిన్నర్ మహ్మద్ నవాజ్.. ఆండ్రూ, చార్లెస్, మోటీలను పెవిలియన్‌కు పంపాడు.
ఆ తర్వాత కెప్టెన్ షాయ్ హోప్(2), రూథర్ ఫర్డ్(11), ఛేజ్(5), షెఫర్డ్(5) వరుస క్రమంలో ఔటయ్యారు. ఆఖరిలో హోల్డర్(30), షమీర్ జోషఫ్(21) మెరుపులు మెరిపించినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లక్ష్య చేధనలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగల్గింది.
పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ మూడు, అయూబ్ రెండు, ముఖియమ్ ఓ వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 2న ఫ్లోరిడా వేదికగా జరగనుంది.
చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్