వికెట్ల వేట... సెంచరీల మోత... | Nine centuries scored on the first day of Ranji Trophy | Sakshi
Sakshi News home page

వికెట్ల వేట... సెంచరీల మోత...

Oct 12 2026 4:31 AM | Updated on Oct 12 2026 4:31 AM

Nine centuries scored on the first day of Ranji Trophy

రంజీ ట్రోఫీ తొలి రోజు తొమ్మిది శతకాలు నమోదు 

ఐదు జట్లు ఆలౌట్‌  

నాగ్‌పూర్‌: దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ 2026–2027 సీజన్‌ ఆదివారం మొదలైంది. మొత్తం 16 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఒకవైపు శతకాల మోతతో పరుగుల వరద పారగా... మరోవైపు వికెట్ల వేట కూడా కొనసాగింది. పుదుచ్చేరితో సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు సాధించింది. ఒకదశలో 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ విదర్భ జట్టును యశ్‌ రాథోడ్‌ (167 బంతుల్లో 131 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ అక్షయ్‌ వాడ్కర్‌ (225 బంతుల్లో 112 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) అజేయ సెంచరీలతో ఆదుకున్నారు. 

వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 246 పరుగులు జోడించారు. బిహార్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఓపెనర్‌ మాధవ్‌ కౌశిక్‌ (252 బంతుల్లో 124 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (164 బంతుల్లో 109 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాలు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కేరళతో మ్యాచ్‌లో జార్ఖండ్‌ బ్యాటర్‌ శిఖర్‌ మోహన్‌ (143) సెంచరీ చేశాడు. 

సర్వీసెస్‌తో మ్యాచ్‌లో మహారాష్ట్ర బ్యాటర్‌ అంకిత్‌ బావ్నే (105 బ్యాటింగ్‌) ‘శత’క్కొట్టాడు. మహారాష్ట్రకు ఆడుతున్న భారత మాజీ ప్లేయర్‌ పృథ్వీ షా (90) సెంచరీ మిస్‌ అయ్యాడు. గుజరాత్‌తో పోరులో ఒడిశా బ్యాటర్‌ గౌరవ్‌ చౌధరీ (121 బ్యాటింగ్‌) సెంచరీతో అజేయంగా నిలిచాడు. తమిళనాడుతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ బ్యాటర్‌ కరణ్‌ లాంబా (103 బ్యాటింగ్‌) సెంచరీ చేసి క్రీజులో ఉన్నాడు. ఉత్తరాఖండ్‌తో పోరులో రైల్వేస్‌ బ్యాటర్‌ వివేక్‌ సింగ్‌ (112) సెంచరీ కొట్టాడు. ఆంధ్రతో మ్యాచ్‌లో కర్ణాటక బ్యాటర్‌ రవిచంద్రన్‌ స్మరణ్‌ (126) సెంచరీ నమోదు చేశాడు. 

డిఫెండింగ్‌ చాంపియన్‌ జమ్మూ కశ్మీర్‌ జట్టు బౌలర్లు రోహిత్‌ శర్మ (5/36), సునీల్‌ కుమార్‌ (4/69) బంతితో అదరగొట్టడంతో... మధ్యప్రదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగులకే ఆలౌటైంది. బెంగాల్‌తో మ్యాచ్‌లో షమీ (4/30) దెబ్బకు ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు పరిమితమైంది. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో రైల్వేస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది.  

సంక్షిప్త స్కోర్లు 
∙ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’  
విదర్భ తొలి ఇన్నింగ్స్‌: 300/5 (85 ఓవర్లలో) (యశ్‌ రాథోడ్‌ 131 బ్యాటింగ్, అక్షయ్‌ వాడ్కర్‌ 112 బ్యాటింగ్‌); పుదుచ్చేరితో మ్యాచ్‌. 
ఉత్తరప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 287/3 (84 ఓవర్లలో) (మాధవ్‌ కౌశిక్‌ 124 బ్యాటింగ్, రింకూ సింగ్‌ 109 బ్యాటింగ్‌); బిహార్‌తో మ్యాచ్‌. 
బరోడా తొలి ఇన్నింగ్స్‌: 204/3 (85 ఓవర్లలో) (శివాలిక్‌ శర్మ 62, శాశ్వత్‌ రావత్‌ 40 బ్యాటింగ్, దీపక్‌ హుడా 38 బ్యాటింగ్‌); గోవాతో మ్యాచ్‌. 
మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 196 ఆలౌట్‌ (74.2 ఓవర్లలో) (శుభం శర్మ 79, ఆర్యన్‌ పాండే 35, రోహిత్‌ శర్మ 5/36, సునీల్‌ కుమార్‌ 4/69). జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: 3/1. 

ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’ 
జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 289/5 (90 ఓవర్లలో) (శిఖర్‌ మోహన్‌ 143, ఉత్కర్‌‡్ష సింగ్‌ 71, వైశాఖ్‌ చంద్రన్‌ 3/71); కేరళతో మ్యాచ్‌. 
ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌: 240 ఆలౌట్‌ (77.3 ఓవర్లలో) (హృతిక్‌ షోకీన్‌ 56, ఆయుశ్‌ దొసెజా 45, సార్థక్‌ రంజన్‌ 33, మొహమ్మద్‌ షమీ 4/30, అమీర్‌ గని 3/45); బెంగాల్‌తో మ్యాచ్‌. 
మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌: 287/5 (90 ఓవర్లలో) (అంకిత్‌ బావ్నే 105 బ్యాటింగ్, పృథ్వీ షా 70, అర్జున్‌ శర్మ 3/74); సర్వీసెస్‌తో మ్యాచ్‌. 
ఒడిశా తొలి ఇన్నింగ్స్‌: 272/3 (90 ఓవర్లలో) (గౌరవ్‌ చౌధరీ 121 బ్యాటింగ్, సందీప్‌ పట్నాయక్‌ 69 బ్యాటింగ్‌); గుజరాత్‌తో మ్యాచ్‌. 

ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’ 
ముంబై తొలి ఇన్నింగ్స్‌: 249/5 (84 ఓవర్లలో) (యశస్వి జైస్వాల్‌ 0, ముషీర్‌ ఖాన్‌ 65, సిద్దేశ్‌ లాడ్‌ 80 బ్యాటింగ్, షమ్స్‌ ములానీ 27 బ్యాటింగ్, రోహిత్‌ ధండా 3/44); చండీగఢ్‌తో మ్యాచ్‌. 
రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 286/4 (85 ఓవర్లలో) (కరణ్‌ లాంబా 103 బ్యాటింగ్, రోహన్‌ రాజ్‌బర్‌ 95, మహిపాల్‌ లొమ్రోర్‌ 31 బ్యాటింగ్, శరవణ కుమార్‌ 3/52); తమిళనాడుతో మ్యాచ్‌. 
రైల్వేస్‌ తొలి ఇన్నింగ్స్‌: 278 ఆలౌట్‌ (87.5 ఓవర్లలో) (వివేక్‌ సింగ్‌ 112, కునాల్‌ యాదవ్‌ 34, దేవేంద్ర సింగ్‌ బోరా 5/49); ఉత్తరాఖండ్‌తో మ్యాచ్ . 
హిమాచల్‌ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 153/7 (77 ఓవర్లలో) (ఆకాశ్‌ వశిష్ట్‌ 49 బ్యాటింగ్, అన్షుల్‌ కంబోజ్‌ 4/32); హరియాణాతో మ్యాచ్‌. 

ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ 
సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌: 308/4 (90 ఓవర్లలో) (చిరాగ్‌ జానీ 83, రవీంద్ర జడేజా 72 బ్యాటింగ్, ప్రేరక్‌ మన్కడ్‌ 92 బ్యాటింగ్‌); ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌. 
అస్సాం తొలి ఇన్నింగ్స్‌: 68/3 (23 ఓవర్లలో) (డేనిష్‌ దాస్‌ 38 బ్యాటింగ్‌); పంజాబ్‌తో మ్యాచ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement