లండన్: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న న్యూజిలాండ్ జట్టు రెండో టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ బుధవారం ఆట ముగిసే సమయానికి 77 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బ్లండెల్ (51; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... గ్లెన్ ఫిలిప్స్ (49 బ్యాటింగ్; 9 ఫోర్లు), మిచెల్ (44; 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర (33; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెథెల్, సోనీ బకెర్ చెరో 2 వికెట్లు తీశారు. ఫిలిప్స్‌తో పాటు కైల్ జేమీసన్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.


