న్యూజిలాండ్‌ రెండో విజయం | New Zealand beat Scotland by 6 wickets in Womens T20 World Cup | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ రెండో విజయం

Jun 24 2026 3:43 AM | Updated on Jun 24 2026 3:43 AM

New Zealand beat Scotland by 6 wickets in Womens T20 World Cup

డిఫెండింగ్‌ చాంపియన్‌ న్యూజిలాండ్‌ మహిళల టి20 ప్రపంచకప్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై నెగ్గింది. మొదట స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్‌ డార్సీ కార్టర్‌ (52 బంతుల్లో 72 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధశతకంతో చెలరేగింది. 

సారా బ్రైస్‌ (22 బంతుల్లో 25; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో అమేలియా కెర్‌ 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... సోఫీ డివైన్‌ 2 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇజీ షార్ప్‌ (43 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్‌), బ్రూక్‌ హాలీడే (38 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించారు. 

ఒక దశలో 26/3తో కష్టాల్లో పడ్డ కివీస్‌ను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. ఈ జంట నాలుగో వికెట్‌కు 101 పరుగులు జోడించింది. స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రైస్, స్లాటర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుధవారం ఇంగ్లండ్, వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement