అరంగేట్రంతోనే అదరగొట్టాడు! | Sakshi
Sakshi News home page

SA vs NZ:అరంగేట్రంతోనే అదరగొట్టాడు!

Published Mon, Feb 5 2024 9:37 AM

Neil brand shines debut against new zealand - Sakshi

దక్షిణాఫ్రికా తాత్కాలిక సారథి నీల్‌ బ్రాండ్‌ తన అంతర్జాతీయ అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో సీనియర్‌ ఆటగాళ్ల గైర్హజరీలో సౌతాఫ్రికా జట్టును నీల్‌ బ్రాండ్‌ ముందుండి నడిపిస్తున్నాడు. దేశీవాళీ క్రికెట్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచిన బ్రాండ్‌కు.. తన అరంగేట్ర సిరీస్‌లోనే సఫారీ జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు.

ఈ క్రమంలో మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా కివీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్రాండ్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు. రచిన్‌ రవీంద్ర, డార్లీ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ వంటి కీలక వికెట్లను బ్రాండ్‌ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 511 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.

258/2 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన బ్లాక్‌ క్యాప్స్‌ అదనంగా 253 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కివీస్‌ బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర(240) అద్బుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగగా.. కేన్‌ విలియమ్సన్‌(118) సెంచరీతో సత్తాచాటాడు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement