నా రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేరు: మురళీథరన్‌ | "Its Very Hard...": Muttiah Muralitharan Says No One Will Break His Test Wickets Record, Know Reason Inside | Sakshi
Sakshi News home page

Muttiah Muralitharan: నా రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేరు

Sep 10 2024 5:59 PM | Updated on Sep 10 2024 6:52 PM

Muttiah Muralitharan Says No One Will Break His Test Wickets Record

శ్రీలంక బౌలింగ్ దిగ్గ‌జం ముత్తయ్య మురళీధరన్ త‌న పేరిట ఉన్న అత్యధిక టెస్టు వికెట్ల (800) రికార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో త‌న రికార్డును ఎవ‌రూ బ‌ద్ద‌లు కొట్ట‌లేర‌ని ధీమా వ్యక్తం చేశాడు. టెస్ట్‌ల్లో తన రికార్డు శాశ్వ‌తంగా మిగిలిపోతుంద‌ని జోస్యం చెప్పాడు. ప్రస్తుత తరం బౌలర్లలో ఎవరూ త‌న రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నాడు.

తన రికార్డు చాలా కాలం పాటు పదిలంగా ఉండటానికి పొట్టి క్రికెటే ప్రధాన కారణమని తెలిపాడు. పొట్టి ఫార్మాట్‌ కారణంగా టెస్ట్‌ క్రికెట్‌ ప్రభ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆట‌గాళ్లు, ప్రేక్ష‌కుల్లో టెస్ట్‌ ఫార్మాట్‌పై ఆస‌క్తి త‌గ్గుతోందని ఆవేదన చెందాడు.  

కాగా, ప్రస్తుత తరం క్రికెటర్లలో మురళీథరన్‌ రికార్డు కునుచూపు మేరలో నాథన్ లియోన్ (530 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (516) మాత్రమే ఉన్నారు. వీరిలో లియోన్ వ‌య‌సు 36, అశ్విన్ వ‌య‌సు 37. వీర‌ద్ద‌రూ రిటైరయ్యేలోపు మురళీథరన్ రికార్డును అందుకునే అవకాశం లేదు. ఇంగ్లండ్‌ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇటీవల 704 వికెట్లతో టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement