చరిత్ర సృష్టిం‍చిన మహ్మద్‌ షమీ | Mohammed Shami Creates History, Becomes First Player In The World | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టిం‍చిన మహ్మద్‌ షమీ

May 24 2026 4:48 AM | Updated on May 24 2026 4:48 AM

Mohammed Shami Creates History, Becomes First Player In The World

ఐపీఎల్‌-2026 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. శనివారం ఏకానా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్నో పరాజయం పాలైంది. సూపర్ జెయింట్స్‌ విధించిన 197 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఊడిపడేసింది. 

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) అజేయ సెంచరీతో సత్తా చాటి తన జట్టును గెలిపించాడు. ఈ విజ‌యంతో పంజాబ్ కింగ్స్ త‌మ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ల‌క్నో మాత్రం పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్ధానంలో నిలిచింది. వ‌రుస‌గా రెండు సీజ‌న్లలోనూ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయింది.

ష‌మీ సరికొత్త చ‌రిత్ర‌
అయితే ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మాత్రం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ సరికొత్త రికార్డు సృష్టించాడు.

పంజాబ్ ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యను షమీ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు.  ఐపీఎల్ చరిత్రలో మహమ్మద్ షమీ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీయడం ఇది 6వ సారి. దీంతో ఇప్పటివరకు  5 సార్లు తొలి బంతికి వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చర్‌ను షమీ అధిగమించాడు. 

షమీ ఓవ‌రాల్‌గా ఈ ఏడాది సీజ‌న్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ వెట‌ర‌న్ పేస‌ర్ సీజ‌న్ ఆరంభంలో మెరుగ్గా రాణించిన‌ప్ప‌టికి, త‌ర్వాత మాత్రం త‌న రిథ‌మ్‌ను కోల్పోయాడు.
చదవండి: ఆర్సీబీకి షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement