ఐపీఎల్‌-2024కు ముందు లక్నో కీలక నిర్ణయం.. | LSG Sign Lance Klusener As Assistant Coach As Part Of Shake Up Ahead Of IPL 2024, See Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024: ఐపీఎల్‌-2024కు ముందు లక్నో కీలక నిర్ణయం..

Mar 2 2024 9:17 PM | Updated on Mar 3 2024 1:56 PM

LSG sign Lance Klusener as assistant coach as part of shake up ahead of IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభానికి ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు అస్టెంట్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌ లాన్స్ క్లూసెనర్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ నియమించింది. హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌తో కలిసి  క్లూసెనర్‌ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా లక్నో ఫ్రాంచైజీ వెల్లడించింది.

కాగా లాన్స్‌ క్లూసెనర్‌ ఇంతకుముందు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ సహాయక కోచ్‌గా పనిచేశాడు. అధేవిధంగా సౌతాఫ్రికా టీ20లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీ డర్భన్‌ సూపర్‌ జెయింట్స్‌ హెడ్‌ కోచ్‌గా క్లూసెనర్‌ ప్రస్తుతం పనిచేస్తున్నాడు. అంతేకాకుండా కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023 ఛాంపియన్స్‌గా గయానా నిలవడంలో అమెజాన్ వారియర్స్‌ది కీలక పాత్ర.

ఇక ఈ ఏడాది సీజన్‌కు ముందు లక్నో తమ వైస్‌ కెప్టెన్‌ను కూడా మార్చేసింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా స్ధానంలో విండీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ను తమ వైస్‌ కెప్టెన్‌గా లక్నో నియమించింది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్‌-2024 సీజన్‌ ప్రారంభం కానుంది.
చదవండి: IND vs ENG: ఇషాన్‌ కిషన్‌కు బీసీసీఐ బంపరాఫర్‌.. కానీ 'నో' చెప్పేశాడుగా!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement