న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టు ఎంపికపై కీలక అప్‌డేట్‌! | Key-Update India Squad Vs NZ ODI Series-Gill-Likely-Play-3 Odis Only | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టు ఎంపికపై కీలక అప్‌డేట్‌!

Oct 13 2026 9:31 AM | Updated on Oct 13 2026 9:33 AM

Key-Update India Squad Vs NZ ODI Series-Gill-Likely-Play-3 Odis Only

Photo Credit: Twitter

నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. జట్టు కూర్పుపై కసరత్తులు చేస్తున్న బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఈ వారంలో జట్టును ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలి మూడు వన్డేలకు మాత్రమే సారథ్యం వహిస్తాడని, చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉంటాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక జట్టు ప్రకటన విడుదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే. అయితే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు వన్డే సిరీస్‌కు ఎంపికయ్యే దాఖలాలు కనిపించడం లేదనిపిస్తోంది. ఇక భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను కూడా ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడించకుండా రెండు లేదా మూడు వన్డేలకు పరిమితం చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. 

విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఆడుతున్న అర్షదీప్ సింగ్‌, ప్రిన్స్ యాదవ్‌లను కివీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రసిధ్ క్రిష్ణ తొలి రెండు వన్డేలకు అందుబాటులో ఉండకపోవచ్చు. మరో విషయమేంటంటే తొలుత మూడు వన్డేలకు మాత్రమే జట్టును ప్రకటించి, ఆ తర్వాత నాలుగు, ఐదు వన్డేలకు జట్టును వేరుగా ఎంపిక చేయాలని బీసీసీఐ చూస్తోందట.

తొలి మూడు వన్డేలకు భారత జట్టు అంచనా:
రోహిత్, గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్‌, అక్షర్ పటేల్‌, కేఎల​ రాహుల్, నమన్ ధీర్, నితీష్ రెడ్డి, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ప్రిన్స్ యాదవ్‌, గుర్నూర్ బ్రార్‌, ఇషాన్ కిషన్‌, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌.

ఇదీ చ‌ద‌వండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement