‘స్కూల్‌ పిల్లాడిలా ప్రవర్తించావు’.. తిల‌క్ వ‌ర్మ‌కు చుర‌క‌లు | Sunil Gavaskar Slams Tilak Varma Over Unbelievable Run Out In 3rd T20I Against West Indies, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘స్కూల్‌ పిల్లాడిలా ప్రవర్తించావు’.. తిల‌క్ వ‌ర్మ‌కు చుర‌క‌లు

Oct 13 2026 9:01 AM | Updated on Oct 13 2026 10:01 AM

Gavaskar Slams Tilak Varma Run-out School Boy Stuff-IND vs WI 3rd T20I

భార‌త్‌, వెస్టిండీస్ మ‌ధ్య జ‌రిగిన మూడో టీ20లో వైస్ కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ వివాదాస్ప‌ద రీతిలో ర‌నౌట్ అయిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌ర్ ప‌టేల్ కొట్టిన బంతి బౌండ‌రీ వెళ్లింద‌ని భావించిన తిల‌క్ వ‌ర్మ ప‌రిగెత్త‌కుండా నింపాదిగా పిచ్‌పై న‌డుచుకుంటూ వెళ్లాడు. అయితే ఇక్క‌డే బుర్ర‌కు ప‌దును పెట్టిన విండీస్ ఆట‌గాళ్లు తెలివిగా తిల‌క్ వ‌ర్మ క్రీజులోకి రాక‌ముందే బెయిల్స్‌ను ఎగుర‌గొట్టారు. దీంతో తిల‌క్ వ‌ర్మ అనూహ్య ర‌నౌట్‌గా వెనుదిరిగాల్సి వ‌చ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

తాజాగా తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్‌పై భార‌త దిగ్గ‌జం సునీల్ గావ‌స్క‌ర్ త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించారు. ఆడుతుంది అంత‌ర్జాతీయ మ్యాచ్ అన్న విష‌యం మ‌రిచిన‌ తిల‌క్ వ‌ర్మ  స్కూల్‌కు వెళ్లే పిల్లాడిలా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఎద్దేవా చేశాడు. అక్షర్ పటేల్ ఆడిన షాట్ బౌండరీకి వెళ్లిందని భావించి, మధ్యలోనే కలుసుకుని గ్లౌస్ పంచ్ ఇచ్చుకున్నారని, కనీసం క్రీజులో బ్యాట్ పెట్టాలని చూడకుండా మైదానంలో నిద్రపోయాడని గవాస్కర్ విమర్శించారు. 

అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి చిన్న తప్పులు మ్యాచ్ ఫలితాలను మార్చేస్తాయని, ఇది కేవలం 'స్కూల్ బాయ్ స్టఫ్' (చిన్నపిల్లల ఆటలాంటిది) అని తప్పుబట్టారు. క్రీజులో బ్యాట్ పెట్టాలని తెలివి లేదా? బౌండరీలు గురించి తర్వాత ఆలోచించాలి. ముందు క్రీజులో బ్యాట్ పెట్టాలని చురకలు అంటించారు. ఆ మాత్రం తెలుసుకోకుండా తిలక్ వర్మ మైదానంలోనే నిద్రపోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి చిన్న తప్పిదాలే, మ్యాచ్ ఫలితాలను మార్చేస్తాయని ఆగ్రహించారు. మ‌రోసారి ఇలాంటి సీన్‌లు రిపీట్ కావొద్దని తిల‌క్ వ‌ర్మ‌కు హిత‌వు ప‌లికారు.

ఇదీ చదవండి: టీ20 చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ చూడ‌ని ర‌నౌట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement