వారికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది: కంగనా రనౌత్‌ | Kangana Ranaut Named Brand Ambassador Of World Para Athletics Championships, Details Inside | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: వారికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది

Jun 19 2025 11:05 AM | Updated on Jun 19 2025 11:21 AM

Kangana Ranaut Named Brand Ambassador Of World Para Athletics Championships

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి, లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌ ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌నకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5 వరకు న్యూఢిల్లీ వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ జరగనుంది.  

వందకు పైగా దేశాల నుంచి పారా అథ్లెట్లు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. ‘పారా అథ్లెట్లకు ఎప్పుడూ నా సహకారం ఉంటుంది. వాళ్లు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ప్రపంచ స్థాయికి వచ్చారు. వారి ఘనతలను గుర్తించాల్సిన అవసరముంది. పారా అథ్లెటిక్స్‌ అనేవి కేవలం క్రీడలు మాత్రమే కాదు. 

దాని వెనక వారి పోరాటం, గుండె ధైర్యం దాగి ఉంటుంది. అలాంటి చాంపియన్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరించనుండటం గర్వంగా భావిస్తున్నా’ అని కంగనా వెల్లడించింది. భారత పారాలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఝఝారియా... కంగనా అంకితభావం, స్ఫూర్తిని కొనియాడాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement