ఒకే ఒక్క వికెట్‌.. చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్‌ బుమ్రా | Jasprit Bumrah Needs 1 Wicket In 2nd Test To Become 1st Player In World Cricket | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఒకే ఒక్క వికెట్‌.. చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్‌ బుమ్రా

Published Thu, Nov 28 2024 3:39 PM | Last Updated on Thu, Nov 28 2024 3:45 PM

Jasprit Bumrah Needs 1 Wicket In 2nd Test To Become 1st Player In World Cricket

టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. వెన్నునొప్పి కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన బుమ్రా.. తన రీ ఎంట్రీలో మరింత రాటుదేలినట్లు కన్పిస్తున్నాడు.

ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిప్పులు చేరుగుతున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అయితే అత‌డిని అడ్డుకోవ‌డం ఎవ‌రి త‌రం కాలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో మొదలు పెట్టిన వికెట్ల వేటను బుమ్రా కొనసాగిస్తునే ఉన్నాడు. 

తాజాగా పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టులో బుమ్రా సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు ప‌డ‌గొట్టిన బుమ్రా.. త‌న బౌలింగ్‌తో కంగారుల‌ను వారి సొంత గ‌డ్డ‌పై కంగారెత్తించాడు.

అంతేకాకుండా రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన బుమ్రా.. తన జట్టు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఇక డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని ఈ వరల్డ్ నెం1 బౌలర్ భావిస్తున్నాడు.

అరుదైన రికార్డుకు చేరువలో బుమ్రా..
అయితే ఈ మ్యాచ్‌కు ముందు బుమ్రాను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. పింక్ బాల్ టెస్టులో బుమ్రా మరో వికెట్ పడగొడితే.. ఈ ఏడాది టెస్ట్‌ల్లో 50 వికెట్ల మైలు రాయిని అందుకోనున్నాడు. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కుతాడు. 

బుమ్రా ప్రస్తుతం ఈ ఏడాది టెస్టుల్లో 49 వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా తర్వాత స్ధానంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 46 వికెట్లతో ఉన్నాడు. కానీ అశ్విన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం లేదు.
చదవండి: #Prithvi Shaw: 'నేను చూసిన టాలెంటెడ్ ప్లేయ‌ర్ల‌లో అత‌డొక‌డు.. మళ్లీ తిరిగి వస్తాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement