సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ గెలుపు | IPL 2026 Match 17: Punjab Kings Vs SRH Updates | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ గెలుపు

Apr 11 2026 3:03 PM | Updated on Apr 11 2026 7:14 PM

IPL 2026 Match 17: Punjab Kings Vs SRH Updates

సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ గెలుపు
సన్‌రైజర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్‌ కింగ్స​్‌.

మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
10.2వ ఓవర్‌- 128 పరుగుల వద్ద పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. శివాంగ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అనికేత్‌ వర్మ (11)కు క్యాచ్‌ ఇచ్చి కూపర్‌ కన్నోల్లీ (11) ఔటయ్యాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
6.2వ ఓవర్‌- 99 పరుగుల వద్ద పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. శివాంగ్‌ కుమార్‌ బౌలింగ్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి ప్రియాంశ్‌ ఆర్య (57) ఔటయ్యాడు. 

ధీటుగా బదులిస్తున్న పంజాబ్‌
220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌ ధీటుగా బదులిస్తుంది. ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (51), ప్రభ్‌సిమ్రన్‌ (41) చెలరేగి ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 93-0గా ఉంది. 

ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌
20 ఓవర్లలో 218-6 (అభిషేక్‌ శర్మ (74), ట్రవిస్‌ హెడ్‌ (38), ఇషాన్‌ కిషన్‌ (27), క్లాసెన్‌ (39), అనికేత్‌ వర్మ (18)).

మూడో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
13.6వ ఓవర్‌-169 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అర్షదీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ కిషన్‌ (27) ఔటయ్యాడు. 

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
అప్పటిదాకా పరుగుల వరద పారించిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లు ఒకే ఓవర్లో ఔటైపోయారు.

ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్ల ఊచకోత
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సన్‌రైజర్స్‌ తొలి 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఏకంగా 84 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (59), ట్రవిస్‌ హెడ్‌ (18) శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అభిషేక్‌ పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. కేవలం18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెడ్‌ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు రఫ్ఫాడిస్తున్నాడు. 

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 11) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతున్నాయి. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు మార్పులు చేయగా.. పంజాబ్‌ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున లివింగ్‌స్టోన్‌ స్థానంలో సలీల్‌ అరోరా బరిలోకి దిగుతున్నాడు. అలాగే ప్రఫుల్‌ హింజ్‌ (ఉనద్కత్‌ స్థానంలో) అరంగేట్రానికి సిద్దమయ్యాడు.

తుది జట్లు..

పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ సబ్స్‌: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ

ఇంపాక్ట్ సబ్స్‌: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, ప్రఫుల్ హింగే, కమిందు మెండిస్

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement