1089 రోజుల రికార్డు పునరావృతం చేసిన బిష్ణోయ్‌ | IPL 2026: Ravi Bishnoi Recreates 1089 Days Old IPL Record With Virat Kohli's Wicket In RR Vs RCB | Sakshi
Sakshi News home page

1089 రోజుల రికార్డు పునరావృతం చేసిన బిష్ణోయ్‌

Apr 11 2026 1:37 PM | Updated on Apr 11 2026 1:44 PM

IPL 2026: Ravi Bishnoi Recreates 1089 Days Old IPL Record With Virat Kohli's Wicket In RR Vs RCB

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 10) జరిగిన ఆసక్తికర సమరంలో ఆర్సీబీపై రాజస్థాన్‌ రాయల్స్‌ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (63) ఆర్సీబీ పతనాన్ని అడ్డుకున్నాడు అతనికి  రొమారియో షెపర్డ్‌ (22), వెంకటేశ్‌ అయ్యర్‌ (29 నాటౌట్‌) సహకరించారు. 

మిగతా బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి (32) పర్వాలేదనిపించగా.. సాల్ట్‌ (0), పడిక్కల్‌ (14), కృనాల్‌ (1), జితేశ్‌ (5), టిమ్‌ డేవిడ్‌ (13) నిరాశపరిచారు. రాయల్స్‌ బౌలర్లలో బిష్ణోయ్‌ (4-0-32-2), బ్రిజేష్‌ శర్మ (4-0-32-2), ఆర్చర్‌ (3-0-33-2) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. సందీప్‌ శర్మ (4-0-47-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్‌ దక్కింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మరోసారి పేట్రేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆతర్వాత ధృవ్‌ జురెల్‌ (43 బంతుల్లో 81 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఫలితంగా రాయల్స్‌ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఈ ఓటమి ఆర్సీబీకి ఈ సీజన్‌లో మొదటిది కాగా.. ఈ గెలుపుతో రాయల్స్‌ తమ అజేయ యాత్రను కొనసాగించింది. ఈ సీజన్‌ రాయల్స్‌ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌ ఓ ప్రత్యేక ఘనత సాధించాడు. విరాట్‌ను అద్భుతమైన గూగ్లీతో క్లీన్‌ బౌల్డ్‌ చేయడం ద్వారా.. 1089 కిందటి ఓ ఘట్టాన్ని పునరావృతం చేశాడు. విరాట్‌ ఐపీఎల్‌లో చివరిసారి 2023 ఎడిషన్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మళ్లీ ఇప్పుడే అతను ఈ తరహాలో వికెట్‌ సమర్పించుకున్నాడు. అంటే ఐపీఎల్‌లో విరాట్‌ 1089 రోజుల తర్వాత క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడన్న మాట. 2023 ఎడిషన్‌లో విరాట్‌ సీఎస్‌కే బౌలర్‌ ఆకాశ్‌ సింగ్‌ చేతిలో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement