సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్‌ | Ayush Shetty stuns World No. 1 to storm into Badminton Asia Championships final | Sakshi
Sakshi News home page

సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్‌

Apr 11 2026 2:16 PM | Updated on Apr 11 2026 2:23 PM

Ayush Shetty stuns World No. 1 to storm into Badminton Asia Championships final

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పెను సంచలనం నమోదైంది. భారత యువ షట్లర్‌ అయుష్‌ శెట్టి ప్రపంచ నంబర్‌ 1 షట్లర్‌ కున్లావుట్‌ విటిడ్సార్న్‌ (థాయ్‌లాండ్‌)ను మట్టికరిపించి చరిత్ర సృష్టించాడు. కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుష్‌.. ఈ టోర్నీ సెమీస్‌లో కున్లావుట్‌పై 10-21, 21-19, 21-17 తేడాతో గెలిచి పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. 

తద్వారా భారత తరఫున ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (సింగిల్స్‌) చేరిన రెండో పురుష షట్లర్‌గా (దినేశ్‌ ఖన్నా (1965), ఓవరాల్‌గా మూడో భారత షట్లర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

75 నిమిషాల పాటు సాగిన సెమీస్‌లో ఆయుష్‌ మొదటి గేమ్‌ కోల్పోయినా, ఆతర్వాత అద్భుత పోరాటపటిమతో వరుసగా రెండు సెట్లు గెలిచి గేమ్‌ను కైవసం​ చేసుకున్నాడు. ఫైనల్లో ఆయుష్‌.. షి యు కీ (చైనా), చౌ టియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) మధ్య జరిగే రెండో సెమీస్‌ విజేతతో తలపడతాడు. అయుష్‌ 2023 వరల్డ్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన తర్వాత వార్తల్లోకెక్కాడు.

Advertisement
 
Advertisement
Advertisement