
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
సీఎస్‌కే బౌలర్లను ఊతికారేశాడు. ముఖ్యంగా సీఎస్‌కే బౌలర్ ఖాలీల్ అహ్మద్‌కు చుక్కలు చూపించాడు. 19వ ఓవర్ వేసిన ఖాలీల్ బౌలింగ్‌లో షెఫర్డ్ 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 33 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
తద్వారా ఐపీఎల్‌లో అత్యంతవేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో ప్లేయర్‌గా కేఎల్ రాహుల్, కమ్మిన్స్ సరసన షెపర్డ్ నిలిచాడు. రాహుల్, కమ్మిన్స్ కూడా 14 బంతుల్లోనే ఆర్ధ శతకం సాధించాడు.ఈ ఫీట్ సాధించిన జాబితాలో యశస్వి జైశ్వాల్(13 బంతులు) అగ్రస్దానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో షెపర్డ్ ఓవరాల్‌గా 6 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదేవిధంగా ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు బాదిన నాలుగో ప్లేయర్‌గా రొమారియో నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
UNREAL HITTING! 💪🔥#RomarioShepherd blitzkrieg hits Chinnaswamy! ⚡
He smashes a jaw-dropping 53 off just 14 balls,
equaling the 2nd fastest fifty in IPL history!
Worthy of this epic clash #Kohli vs #Dhoni - one last time? 🙌🏻
Watch the LIVE action in Haryanvi commentary ➡… pic.twitter.com/cOReV8qcPT— Star Sports (@StarSportsIndia) May 3, 2025