IPL 2024: ఈసారి వేలం భారత్‌లో కాదు! ఆరోజే డెడ్‌లైన్‌.. కీలక విషయాలు | IPL 2024 Auction: Purse, Venue, Deadline To Submit Retained Players, Released Players List, All You Need To Know - Sakshi
Sakshi News home page

IPL 2024 Auction: ఈసారి వేలం భారత్‌లో కాదు! ఆరోజే డెడ్‌లైన్‌.. అత్యధికంగా ఆ ఫ్రాంఛైజీ వద్దనే...

Oct 27 2023 7:11 PM | Updated on Oct 27 2023 7:59 PM

IPL 2024 Auction: Purse Venue Deadline Submit Retained Released Players List - Sakshi

ఐపీఎల్‌ ట్రోఫీ (PC: X)

IPL 2023- Mini Auction- Details: వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫీవర్‌ నడుస్తుండగానే క్రికెట్‌ ప్రేమికులను ఊరించే మరో వార్త తెర మీదకు వచ్చింది. ఈ ఐసీసీ టోర్నీ జరుగుతుండగానే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సంబంధించిన ప్లేయర్‌ రిటెన్షన్‌ లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఐపీఎల్‌-2024 కోసం తమతో అట్టిపెట్టుకునే, రిలీజ్‌ చేసే క్రికెటర్ల జాబితాను సమర్పించేందుకు భారత నియంత్రణ మండలి వచ్చే నెలలో డెడ్‌లైన్‌ విధించినట్లు సమాచారం. ఐపీఎల్‌లో భాగమైన పది ఫ్రాంఛైజీలు ఈ వివరాలను నవంబరు 15లోగా సమర్పించాల్సిందిగా బీసీసీఐ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈసారి వేలం నిర్వహణ అక్కడే
అదే విధంగా ఐపీఎల్‌-2024 వేలానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి ఆక్షన్‌ భారత్‌లో కాకుండా దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. డిసెంబరు 18 లేదంటే 19వ తేదీన మినీ వేలానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు ఈసారి ఫ్రాంఛైజీల పర్సు వాల్యూను ఐదు కోట్లు పెంచి రూ. 100 కోట్లు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈసారి ఫ్రాంఛైజీలు వదులుకునే ఆటగాళ్ల జాబితాలో బెన్‌స్టోక్స్‌(చెన్నై సూపర్‌ కింగ్స్‌), శార్దూల్‌ ఠాకూర్‌(కోల్‌కతా నైట్‌రైడర్స్‌), లాకీ ఫెర్గూసన్‌(కోల్‌కతా నైట్‌ రైడర్స్‌) తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌-2023 టోర్నీ నవంబరు 19న ఫైనల్‌తో ముగియనుంది.

ఏ ఫ్రాంఛైజీ పర్సులో ఎంత డబ్బు ఉంది?
1.పంజాబ్ కింగ్స్: రూ.12.20 కోట్లు
2.ముంబై ఇండియన్స్: రూ.50 లక్షలు
3.సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ.6.55 కోట్లు
4.గుజరాత్ టైటాన్స్: రూ.4.45 కోట్లు
5.ఢిల్లీ క్యాపిటల్స్: రూ.4.45 కోట్లు
6.లక్నో సూపర్ జెయింట్స్: రూ.3.55 కోట్లు
7.రాజస్థాన్ రాయల్స్: రూ.3.35 కోట్లు
8.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ.1.75 కోట్లు
9.కోల్కతా నైట్రైడర్స్: రూ.1.65 కోట్లు
10. చెన్నై సూపర్ కింగ్స్: రూ.1.5 కోట్లు.

చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ పాండ్యా లేడు.. ఒకవేళ బుమ్రా కూడా.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement