IPL 2023: చాంపియన్‌గా చెన్నై.. గిల్‌ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే..

IPL 2023: Orange Cap Purple Cap Award Winners Prize Money Details - Sakshi

IPL 2023 Winner CSK: మహేంద్ర సింగ్‌ ధోని మంత్రజాలం ఐపీఎల్‌లో మరోసారి అద్భుతంగా పని చేసింది. తనకే సాధ్యమైనరీతిలో సాధారణ ఆటగాళ్లతోనే జట్టును నడిపించిన అతను ఐదో ట్రోఫీతో సగర్వంగా నిలిచాడు. ఐపీఎల్‌-2023 ఫైనల్లో 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అక్కడక్కడా తడబడినా చివరకు సీఎస్‌కే గెలుపు సొంతం చేసుకుంది.


Photo Credit : IPL Twitter

మోహిత్‌ శర్మ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి 4 బంతుల్లో అతను 3 పరుగులే ఇచ్చాడు. దాంతో గుజరాత్‌ గెలుస్తున్నట్లుగా అనిపించింది. అయితే తర్వాతి రెండు బంతులను జడేజా 6, 4గా మలచి సూపర్‌ కింగ్స్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలవాలని భావించిన గుజరాత్‌ టైటాన్స్‌ చివరకు రన్నరప్‌గా సంతృప్తి చెందింది.

సాధారణంగా 215 పరుగుల లక్ష్యం అసాధ్యంగా కనిపించినా... వర్షం అంతరాయంతో ఓవర్లు తగ్గడం, చేతిలో 10 వికెట్లు ఉండటం కూడా చెన్నైకి మేలు చేసింది. చివరిదిగా భావిస్తున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో ధోని తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరగా... ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అంబటి రాయుడు తన కెరీర్‌లో ఆరో టైటిల్‌తో ఘనమైన ముగింపునిచ్చాడు.  


Photo Credit : IPL Twitter

మొత్తం ప్రైజ్‌మనీ: 
►రూ. 46 కోట్ల 50 లక్షలు 


Photo Credit : IPL Twitter
►విజేత జట్టుకు: రూ. 20 కోట్లు 
►రన్నరప్‌ జట్టుకు: రూ. 13 కోట్లు 
►మూడో స్థానం: రూ. 7 కోట్లు -(ముంబై ఇండియన్స్‌) 
►నాలుగో స్థానం: రూ. 6 కోట్ల 50 లక్షలు (లక్నో సూపర్‌ జెయింట్స్‌) 


Photo Credit : IPL Twitter

ఆరెంజ్‌ క్యాప్‌   (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌) 
►శుబ్‌మన్‌ గిల్‌ (890 పరుగులు; 17 మ్యాచ్‌లు) సెంచరీలు: 3, అర్ధ సెంచరీలు: 4 
►ఐపీఎల్‌ టోర్నీలో ఆరెంజ్‌ క్యాప్‌ నెగ్గిన పిన్న వయస్కుడిగా గిల్‌ (23 ఏళ్ల 263 రోజులు) గుర్తింపు పొందాడు. 
►ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు 


Photo Credit : IPL Twitter

పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌) 
►మొహమ్మద్‌ షమీ (28 వికెట్లు; 17 మ్యాచ్‌లు) 
►ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు  


Photo Credit : IPL Twitter

ఇతర అవార్డులు, ప్రైజ్‌మనీ:
ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: యశస్వి జైశ్వాల్‌(రాజస్తాన్‌ రాయల్స్‌- రూ. 10 లక్షలు)
►సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (ఆర్సీబీ- రూ. 10 లక్షలు)
►మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌: శుబ్‌మన్‌ గిల్‌ (రూ. 10 లక్షలు)
►గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది సీజన్‌: శుబ్‌మన్‌ గిల్‌ (రూ. 10 లక్షలు)

►క్యాచ్‌ ఆఫ్‌ ది సీజన్‌: రషీద్‌ ఖాన్‌ (రూ. 10 లక్షలు)
►ఫెయిర్‌ ప్లే అవార్డు:ఢిల్లీ క్యాపిటల్స్‌

►సీజన్‌లో అత్యధిక ఫోర్లు: శుబ్‌మన్‌ గిల్‌ (రూ. 10 లక్షలు)
►లాంగెస్ట్‌ సిక్స్‌ ఆఫ్‌ ది సీజన్‌ : ఫాఫ్‌ డుప్లెసిస్‌ (రూ. 10 లక్షలు)
►బెస్ట్‌ పిచ్‌, గ్రౌండ్‌ ఆఫ్‌ ది సీజన్‌: ఈడెన్‌ గార్డెన్స్‌, వాంఖడే స్టేడియం (రూ. 50 లక్షలు)

చదవండి: 550 పరుగుల మార్క్‌ దాటాడు.. ఎవరికి సాధ్యం కాని చెత్త రికార్డు

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top